Telugu Global
NEWS

ఇక చ‌లానాకి చెల్లు...ఫోన్‌లోనే ధృవ‌ప‌త్రాల‌న్నీ!

రోడ్డుమీద వెళుతున్న వాహ‌నాల‌ను  పోలీసులు  అపి చ‌లానాలు బాదే కార్య‌క్ర‌మానికి ఇక కాలం చెల్లిపోనుంది. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్నఓ  స‌రికొత్త నిర్ణ‌యంతో ఫోన్‌లోనే డ్రైవింగ్ లైసెన్సుతో పాటు వాహ‌నం తాలూకూ స‌క‌ల ధృవ‌ప‌త్రాల‌ను భ‌ద్ర‌ప‌ర‌చుకునే వీలు క‌లుగుతుంది.  ఏ లైసెన్సులు, అత్య‌వ‌స‌ర ప‌త్రాలు మ‌ర్చిపోయామో అని…ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. జేబులో ఫోను ఉంటే చాలు, వాహ‌నం తాలూకూ అన్ని ప‌త్రాలు అర‌చేతిలో డిజిట‌ల్ రూపంలో ఇమిడిపోతాయి. ఇందుకోసం ప్రభుత్వం ఆర్‌టిఎ ఎం- వ్యాలెట్ అనే పేరుతో మొబైల్ […]

ఇక చ‌లానాకి చెల్లు...ఫోన్‌లోనే ధృవ‌ప‌త్రాల‌న్నీ!
X

రోడ్డుమీద వెళుతున్న వాహ‌నాల‌ను పోలీసులు అపి చ‌లానాలు బాదే కార్య‌క్ర‌మానికి ఇక కాలం చెల్లిపోనుంది. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్నఓ స‌రికొత్త నిర్ణ‌యంతో ఫోన్‌లోనే డ్రైవింగ్ లైసెన్సుతో పాటు వాహ‌నం తాలూకూ స‌క‌ల ధృవ‌ప‌త్రాల‌ను భ‌ద్ర‌ప‌ర‌చుకునే వీలు క‌లుగుతుంది. ఏ లైసెన్సులు, అత్య‌వ‌స‌ర ప‌త్రాలు మ‌ర్చిపోయామో అని…ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. జేబులో ఫోను ఉంటే చాలు, వాహ‌నం తాలూకూ అన్ని ప‌త్రాలు అర‌చేతిలో డిజిట‌ల్ రూపంలో ఇమిడిపోతాయి. ఇందుకోసం ప్రభుత్వం ఆర్‌టిఎ ఎం- వ్యాలెట్ అనే పేరుతో మొబైల్ యాప్‌ని రూపొందించింది. ఇందులో డ్రైవింగ్‌ లైసెన్సు, రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రం(ఆర్సీ), కాలుష్య నియంత్రణ తనిఖీపత్రం, వాహన బీమా, వాహన పర్మిట్లు ఇలా అన్నింటినీ భ‌ద్ర‌ప‌ర‌చుకోవ‌చ్చు. ఈ యాప్‌ని ఫోన్లోని ప్లేస్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వీలు క‌ల్పించారు. ఒక వ్య‌క్తి త‌న‌కు సంబంధించిన ఎన్ని ధృవ‌ప‌త్రాల‌నైనా ఈ యాప్‌లో సేవ్ చేసి పెట్టుకోవ‌చ్చు. ఆండ్రాయడ్‌, ఐఓఎస్ ఫోనుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

యాప్‌ని డౌన్ లోడ్ చేసుకున్న అనంత‌రం, ధృవ‌పత్రాల‌పై ఉన్న పేరుని ఫోన్లో న‌మోదు చేయాలి. దాంతో వ‌న్ టైమ్ పాస్‌వ‌ర్డ్ వ‌స్తుంది. దాన్ని న‌మోదు చేసిన వెంట‌నే ఆ ప‌త్రం తాలూకూ కాపీ డిజిట‌ల్ రూపంలో ఫోన్‌లో క‌న‌బ‌డుతుంది. డిజిట‌ల్ విధానంలో ఫోన్లో ఉన్న ధృవ‌ప‌త్రాల‌ను ఆమోదించాల‌ని ప్ర‌భుత్వం ర‌వాణా, పోలీసు త‌దిత‌ర విభాగాల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల‌కు ఆదేశాలు జారీచేసింది. శ‌నివారంనుండి అందుబాటులోకి రానున్న ఈ యాప్‌తో న‌కిలీ ప‌త్రాల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని అధికారులు ఆశిస్తున్నారు.

First Published:  26 March 2016 1:32 AM GMT
Next Story