Telugu Global
Cinema & Entertainment

ఈ పక్కింటి అబ్బాయి కూడా రేటు పెంచేశాడు...

హిట్ వస్తే పారితోషికం పెంచడం ఆటోమేటిగ్గా జరిగిపోతోంది. బడా స్టార్ల నుంచి ఛోటా హీరోల వరకు అందరూ రేట్లు పెంచేస్తున్నారు. ఈమధ్యే నాని తన పారితోషికం పెంచినట్టు వార్తలొచ్చాయి. నిర్మాతలు ఇస్తుంటే నేనెందుకు కాదనాలి అంటూ నాని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని ఇండైరెక్ట్ గా ఓకే చేశాడు. ఇప్పుడు ఈ బాటలో నాగశౌర్య కూడా ఉన్నాడు. కల్యాణ్ వైభోగమే సినిమా హిట్టవ్వడంతో… ఈ కుర్రహీరో ఇప్పుడు కోటి నుంచి కోటిన్నర డిమాండ్ చేస్తున్నాడట. […]

ఈ పక్కింటి అబ్బాయి కూడా రేటు పెంచేశాడు...
X
హిట్ వస్తే పారితోషికం పెంచడం ఆటోమేటిగ్గా జరిగిపోతోంది. బడా స్టార్ల నుంచి ఛోటా హీరోల వరకు అందరూ రేట్లు పెంచేస్తున్నారు. ఈమధ్యే నాని తన పారితోషికం పెంచినట్టు వార్తలొచ్చాయి. నిర్మాతలు ఇస్తుంటే నేనెందుకు కాదనాలి అంటూ నాని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని ఇండైరెక్ట్ గా ఓకే చేశాడు. ఇప్పుడు ఈ బాటలో నాగశౌర్య కూడా ఉన్నాడు. కల్యాణ్ వైభోగమే సినిమా హిట్టవ్వడంతో… ఈ కుర్రహీరో ఇప్పుడు కోటి నుంచి కోటిన్నర డిమాండ్ చేస్తున్నాడట. దీంతో అవాక్కవ్వడం ఇండస్ట్రీ వంతయింది. ఎందుకంటే.. కల్యాణ్ వైభోగమే సినిమా విజయం క్రెడిట్ నాగశౌర్యది కాదు. ఎంతో కష్టపడి ఆ సినిమాను తెరకెక్కించిన నందినీరెడ్డిది. ఎన్నో ఏళ్లు గ్యాప్ తీసుకొని, రీసెర్చ్ చేసి కల్యాణ్ వైభోగమే సినిమాతో మళ్లీ సక్సెస్ బాట పట్టింది నందినీరెడ్డి. కానీ ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకున్న నాగశౌర్య.. ఇప్పుడు పారితోషికం కూడా పెంచినట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఈ కుర్రహీరో… నాగబాబు కూతురు నిహారికతో ఒక మనసు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సమ్మర్ లోనే అది విడుదలవుతుంది. అది కూడా హిట్టయితే… ఇంకెంత రేటు పెంచుతాడో…
First Published:  26 March 2016 12:25 AM GMT
Next Story