Telugu Global
NEWS

కోట్ల వ్యాఖ్యల వెనుక మర్మమేంటి?

కేంద్ర మాజీ మంత్రి కోట్ల  సూర్యప్రకాశ్‌ రెడ్డి టీడీపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలో టీడీపీ పనైపోయిందని తేల్చేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే తీవ్రస్థాయిలో ప్రజావ్యతిరేకత మూటకట్టుకున్న ప్రభుత్వం ఇదేనని అన్నారు. టీడీపీ  నేతలు ప్రజాసంక్షేమం మరిచి సొంత సంపాదన మీద పడ్డారని విమర్శించారు. చంద్రబాబు అమరావతి జపం చేస్తూ ప్రజలను గాలికొదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో కనీసం ప్రజలకు తాగునీరు కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.  కర్నూలు జిల్లా గూడూరులో జరిగిన ఒక కార్యక్రమంలో […]

కోట్ల వ్యాఖ్యల వెనుక మర్మమేంటి?
X

కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి టీడీపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలో టీడీపీ పనైపోయిందని తేల్చేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే తీవ్రస్థాయిలో ప్రజావ్యతిరేకత మూటకట్టుకున్న ప్రభుత్వం ఇదేనని అన్నారు. టీడీపీ నేతలు ప్రజాసంక్షేమం మరిచి సొంత సంపాదన మీద పడ్డారని విమర్శించారు. చంద్రబాబు అమరావతి జపం చేస్తూ ప్రజలను గాలికొదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో కనీసం ప్రజలకు తాగునీరు కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కర్నూలు జిల్లా గూడూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

కోట్ల.. టీడీపీలో చేరుతారని ఆ మధ్య ప్రచారం జరిగింది. టీడీపీ నేతలు కూడా ఆయనతో సంప్రదింపులు జరిపారని వార్తలొచ్చాయి. అయితే టీడీపీ పనైపోయిందని కోట్ల తేల్చేయడం విశేషం. టీడీపీ సంగతేమో గానీ కాంగ్రెస్‌ పని రాష్ట్రంలో అయిపోయి చాలా కాలం అయింది. కాబట్టి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే కాంగ్రెస్‌ను వీడకతప్పదన్న అభిప్రాయం ఉంది. అయితే ఇప్పుడు టీడీపీ పనైపోయిందని కోట్ల తేల్చిశారు. మరి భవిష్యత్తులో కోట్ల ఎటు అడుగులు వేస్తారో!.

Click on Image to Read:

chiru-chandrababu

mla-vishnu

ashok-gajapathi-raju

jagan-koneru

Somireddy-Chandramohan-Redd

sunny

anitha

roja 143

radhakrishna

lokesh-ganta-1

bjp-leaders

ys-jagan

ysrcp

jagan

roja-ramoji

First Published:  26 March 2016 1:04 AM GMT
Next Story