Telugu Global
WOMEN

గుడ్డుతో...వెరీ గుడ్ ఆర్ట్‌!

గుడ్డుని ప‌గుల గొట్టి,  లేదా ఉడికించి కూర‌వండుకుని తిన‌డ‌మే మ‌న‌కు తెలుసు..కానీ ఫ‌రా స‌యీద్ కి మాత్రం గ‌డ్డుని చూస్తే ఎన్నో గుడ్ అయిడియాలు త‌న్నుకువ‌స్తాయి. అందుకే ఆమె అమెరికాలో ప్ర‌ముఖ భార‌త ఎగ్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకోగ‌లిగారు. ఇటీవ‌ల చికాగోలో ఆమె నిర్వ‌హించిన గుడ్డు క‌ళాకృతుల ప్ర‌ద‌ర్శ‌న‌ క‌ళాభిమానుల మ‌న‌సుల‌ను స‌మ్మోహ‌న ప‌ర‌చింది. ‌ చిగాకో సింఫ‌నీ సెంట‌ర్‌లో ఈ నెల 20, 21 తేదీల్లో  తాను రూపొందించిన 70  క‌ళాకృతుల‌ను ప్ర‌ద‌ర్శించారామె. వీట‌న్నింటిలో ప్రాథ‌మికంగా […]

గుడ్డుతో...వెరీ గుడ్ ఆర్ట్‌!
X

గుడ్డుని ప‌గుల గొట్టి, లేదా ఉడికించి కూర‌వండుకుని తిన‌డ‌మే మ‌న‌కు తెలుసు..కానీ ఫ‌రా స‌యీద్ కి మాత్రం గ‌డ్డుని చూస్తే ఎన్నో గుడ్ అయిడియాలు త‌న్నుకువ‌స్తాయి. అందుకే ఆమె అమెరికాలో ప్ర‌ముఖ భార‌త ఎగ్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకోగ‌లిగారు. ఇటీవ‌ల చికాగోలో ఆమె నిర్వ‌హించిన గుడ్డు క‌ళాకృతుల ప్ర‌ద‌ర్శ‌న‌ క‌ళాభిమానుల మ‌న‌సుల‌ను స‌మ్మోహ‌న ప‌ర‌చింది. ‌ చిగాకో సింఫ‌నీ సెంట‌ర్‌లో ఈ నెల 20, 21 తేదీల్లో తాను రూపొందించిన 70 క‌ళాకృతుల‌ను ప్ర‌ద‌ర్శించారామె. వీట‌న్నింటిలో ప్రాథ‌మికంగా ఉప‌యోగించిన వ‌స్తువు… వివిధ ప‌క్షుల తాలూకూ గుడ్ల పెంకు భాగ‌మే. గినియా, ట‌ర్కీ, నిప్పుకోడి…ఇంకా ప‌లుర‌కాల బాతులు, కొంగ‌ల గుడ్ల లోప‌లి భాగాన్ని తీసేసి డొల్ల‌గా మారిన గుడ్డుని ఉప‌యోగించి అంద‌మైన క‌ళా రూపాలు త‌యారుచేశారు.

b81192f1-9fc3-4496-8342-e7e33d3f2b5bఇంకా ప‌లుర‌కాల రంగురాళ్లు, బంగారం, వెండిలాంటి ఆభ‌ర‌ణాలు .. ఎన్నో అలంక‌ర‌ణ వ‌స్తువుల‌ను సైతం ఆమె ఈ క‌ళాకృతుల్లో వినియోగించారు. ప‌దిహేడేళ్ల క్రితం ఖ‌త‌ర్‌లో ఉండ‌గా ఫ‌రా స‌యీద్ ఎగ్ ఆర్ట్‌ని మొద‌టిసారిగా చూశారు. అప్ప‌టి నుండి దానిపై మ‌క్కువ‌తో కృషి చేశారు. ప్ర‌స్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు. ఆమె భ‌ర్త డాక్ట‌ర్ అసాఫ్ స‌యీద్ చికాగోలో ఇండియా కాన్సుల్ జ‌న‌ర‌ల్‌గా ఉన్నారు.

అతి సున్నితంగా ఉండే గుడ్డు పెంకు మీద చిత్రాన్ని గీయాల‌న్నా, రంగులు వేయాల‌న్నా, అలంక‌ర‌ణ చేయాల‌న్నా చాలా క‌ష్ట‌మైన ప‌ని. కానీ ఫరా స‌యీద్ ఆ ప‌నుల‌న్నీ చాలా తేలిగ్గా చేయ‌గ‌ల‌రు. ఈ క‌ళ‌కు అంతు లేద‌ని, ఎంత సృజ‌న‌నైనా ఇందులో ప్ర‌ద‌ర్శించ‌వ‌చ్చ‌ని ఆమె అంటారు. ఇంత‌కుముందు కూడా ఆమె కోపెన్ హ‌గ‌న్‌, న్యూఢిల్లీ, సానాల్లో సోలోగా ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు.

2f9678f6-66a1-4d97-a765-8ac61f717122 19e6608e-e793-410e-bb88-c72364d4b4c2

1576d051-21a9-40eb-9cd0-131e352a0621 14396b1c-b672-461a-8922-56965319a06a

577598b1-a2c4-4832-ab71-afaa75a9a2b5 a28c4a3f-9336-43cf-8c6f-c54b8582a8ad

b5e3e62e-5229-4a09-870c-01b2217f7521 dd16b453-0ff9-493f-9ea5-ee9ef42bbc4f

First Published:  26 March 2016 5:33 AM GMT
Next Story