Telugu Global
Cinema & Entertainment

వచ్చే నెల నుంచి ఒకేసారి 3 సినిమాలు

ప్రస్తుతం టాలీవుడ్ లో ఒకేసారి రెండు కంటే ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోల్ని వేళ్లపై లెక్కబెట్టొచ్చు. సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నామనే సాకుతో హీరోలంతా బాగా షూటింగ్ లు తగ్గించేశారు. చివరికి ఏడాదికి అరడజను సినిమాలు చేసే అల్లరి నరేష్ కూడా నాకెందుకొచ్చింది ఈ బాధ అనుకున్నాడేమో అతడు కూడా సినిమాలు తగ్గించేశాడు. ఇక స్టార్ హీరోల సంగతి సరేసరి. ఏడాదికి ఒకటి చేస్తే చాలా ఎక్కువ. ఇలాంటి టైమ్ లో ట్రెండ్ ను తిరగరాస్తున్నాడు సాయిధర్మతేజ. […]

వచ్చే నెల నుంచి ఒకేసారి 3 సినిమాలు
X
ప్రస్తుతం టాలీవుడ్ లో ఒకేసారి రెండు కంటే ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోల్ని వేళ్లపై లెక్కబెట్టొచ్చు. సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నామనే సాకుతో హీరోలంతా బాగా షూటింగ్ లు తగ్గించేశారు. చివరికి ఏడాదికి అరడజను సినిమాలు చేసే అల్లరి నరేష్ కూడా నాకెందుకొచ్చింది ఈ బాధ అనుకున్నాడేమో అతడు కూడా సినిమాలు తగ్గించేశాడు. ఇక స్టార్ హీరోల సంగతి సరేసరి. ఏడాదికి ఒకటి చేస్తే చాలా ఎక్కువ. ఇలాంటి టైమ్ లో ట్రెండ్ ను తిరగరాస్తున్నాడు సాయిధర్మతేజ. ఒకేసారి 3 సినిమాలు లైన్లో పెట్టాడు. వచ్చేనెల నుంచి సాయిధర్మతేజ… ఒకేసారి సైమల్టేనియస్ గా మూడు సినిమాలు చేయబోతున్నాడు. ప్రస్తుతం తిక్క, సుప్రీమ్ అనే సినిమాలు చేస్తున్నాడు ఈ మెగా హీరో. వచ్చేనెల నుంచి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ఏప్రిల్ రెండో వారంలో ప్రారంభం కానున్న ఈ సినిమాకు విన్నర్ అనే టైటిల్ అనుకుంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది. సో… వచ్చేనెల రెండో వారం నుంచి ఒకేసారి 3 సినిమాల సెట్స్ పై చక్కర్లు కొట్టబోతున్నాడు సాయిధర్మతేజ. ప్రస్తుతం సాయిధర్మతేజలా వరుసగా సినిమాలు చేస్తున్న హీరో నారా రోహిత్ మాత్రమే.
First Published:  25 March 2016 12:10 AM GMT
Next Story