Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబు, కరీనా కపూర్ మధ్య....

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ బాంబ్ షెల్ కరీనా కపూర్ కు ఎలాంటి సంబంధం లేదు. ఇద్దరూ కలిసి సినిమాలు కూడా చేయలేదు. పబ్లిక్ ఫంక్షన్లలో కలుసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ. కానీ ఇద్దరి మధ్య ఓ సీక్రెట్ బంధం కొనసాగుతోంది. ఆ విషయాన్ని కరీనాకపూర్ స్వయంగా వెల్లడించింది. తన కొత్త సినిమా కీ అండ్ కా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన కరీనా కపూర్…. మహేష్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది. […]

మహేష్ బాబు, కరీనా కపూర్ మధ్య....
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ బాంబ్ షెల్ కరీనా కపూర్ కు ఎలాంటి సంబంధం లేదు. ఇద్దరూ కలిసి సినిమాలు కూడా చేయలేదు. పబ్లిక్ ఫంక్షన్లలో కలుసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ. కానీ ఇద్దరి మధ్య ఓ సీక్రెట్ బంధం కొనసాగుతోంది. ఆ విషయాన్ని కరీనాకపూర్ స్వయంగా వెల్లడించింది. తన కొత్త సినిమా కీ అండ్ కా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన కరీనా కపూర్…. మహేష్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది. తామిద్దరూ సీడీలు ఇచ్చిపుచ్చుకుంటామని తెలిపింది. టాలీవుడ్ లో కొత్త సినిమా ఏది విడుదలైనా… అది బాగుంటే దానికి సంబంధించిన డీవీడీని మహేష్ తనకు పంపిస్తాడని… అదే విధంగా హిందీ సినిమాలకు సంబంధించిన డీవీడీల్ని తను కూడా నమ్రతకు పంపిస్తుంటానని చెప్పింది. ఇదే కాకుండా…. భవిష్యత్ సినిమాలేంటనే విషయంపై కూడా ఇద్దరూ ఆరా తీస్తుంటారట. పెద్దగా పరిచయం లేకపోయినా…. ఒకరితో ఒకరు ఇలా సినిమా రూపంలో టచ్ లో ఉంటాని చెబుతోంది బెబో. వీళ్లిద్దరి మధ్య అలా బంధం పెనవేసుకుందట.
First Published:  25 March 2016 12:14 AM GMT
Next Story