Telugu Global
Cinema & Entertainment

సందీప్ కిష‌న్ `నేరం`  చేశాడు..!

న‌టుడిగా సినిమా సినిమాకు త‌న ప్ర‌తిభ‌ను చాటుకుంటున్న సందీప్ కిష‌న్.. తాజాగా  నేరం అనే  మ‌ల‌యాళ సినిమాను  రీమేక్ చేసి ర‌న్ గా వ‌చ్చాడు. అసాధ్యుడు, మిస్టర్ నూకయ్య లాంటి ఫ్లాప్ సినిమాలు చేసిన దర్శకుడు అనీ కన్నెగంటి. మరోసారి తన అదృష్టాన్ని టెస్ట్ చేసుకున్నాడు.`నేరం` మళయాలం తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన సినిమా కావటంతో దర్శకుడు తెలుగులో పెద్దగా మార్పులేమీ చేయలేదు. ముఖ్యంగా ఒక్కరోజులో జరిగే థ్రిల్లర్ సినిమా కావటంతో నేటివిటీ సమస్య కూడా పెద్దగా […]

సందీప్ కిష‌న్ `నేరం`  చేశాడు..!
X

న‌టుడిగా సినిమా సినిమాకు త‌న ప్ర‌తిభ‌ను చాటుకుంటున్న సందీప్ కిష‌న్.. తాజాగా నేరం అనే మ‌ల‌యాళ సినిమాను రీమేక్ చేసి ర‌న్ గా వ‌చ్చాడు. అసాధ్యుడు, మిస్టర్ నూకయ్య లాంటి ఫ్లాప్ సినిమాలు చేసిన దర్శకుడు అనీ కన్నెగంటి. మరోసారి తన అదృష్టాన్ని టెస్ట్ చేసుకున్నాడు.'నేరం' మళయాలం తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన సినిమా కావటంతో దర్శకుడు తెలుగులో పెద్దగా మార్పులేమీ చేయలేదు. ముఖ్యంగా ఒక్కరోజులో జరిగే థ్రిల్లర్ సినిమా కావటంతో నేటివిటీ సమస్య కూడా పెద్దగా కనిపించలేదు. ఒక్క రోజులో జరిగే సంఘటనలను స్క్రీన్ ప్లే తో రాసుకున్న దర్శకుడు ఆడియన్స్ కట్టిపడేశాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. ముఖ్యంగా సాయి కార్తీక్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. మొత్తం మీద సందీప్ కిష‌న్ ర‌న్ అలియాస్ 'నేరం' చిత్రం బాగానే ఉంద‌న్న‌మాట‌.

First Published:  24 March 2016 6:08 AM GMT
Next Story