Telugu Global
NEWS

కన్హయ్యపై దాడి

హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో కన్హయ్య సభను గోసంరక్షక్‌ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోకి చొరబడిన గోసంరక్షక్‌దళ్ కార్యకర్తలు కన్హయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు కన్హయ్యపైకి చెప్పులు విసిరారు. ఈసమయంలో వామపక్ష, గోరక్షక్‌దళ్‌ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. గోసంరక్షక్‌ దళ్ కార్యకర్తలు  మీడియా కెమెరాలు కూడా ధ్వంసం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి బెదిరింపులకు, అడ్డంకులకు భయపడే ప్రసక్తే లేదని కన్హయ్య అన్నారు. సమాజంలో అంతరాలు తగ్గించేందుకు తాము కృషి […]

కన్హయ్యపై దాడి
X

హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో కన్హయ్య సభను గోసంరక్షక్‌ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోకి చొరబడిన గోసంరక్షక్‌దళ్ కార్యకర్తలు కన్హయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు కన్హయ్యపైకి చెప్పులు విసిరారు. ఈసమయంలో వామపక్ష, గోరక్షక్‌దళ్‌ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. గోసంరక్షక్‌ దళ్ కార్యకర్తలు మీడియా కెమెరాలు కూడా ధ్వంసం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి బెదిరింపులకు, అడ్డంకులకు భయపడే ప్రసక్తే లేదని కన్హయ్య అన్నారు. సమాజంలో అంతరాలు తగ్గించేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు.

కన్హయ్య ప్రసంగిస్తుండగా ఒక గోసంరక్షక్‌ దళ్ కార్యకర్త చెప్పువిసరగా కన్హయ్య అవేవి పట్టించుకోకుండా, ఇవ్వన్నీ సహజమేనంటు నవ్వుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. వాళ్లు రాళ్లు వేసినా, చెప్పులు వేసినా వెనక్కు తగ్గనని, జేఎన్ యూలో చంపదెబ్బ కొట్టినవాళ్లని వదిలేశామని, కొందరు పబ్లిసిటీ కోసం ఇలాంటివి చేస్తుంటారని చెప్పారు. భయపెడితే తాను భయపడనని ఆ విషయంలో తాను గాంధేయవాదినని అన్నారు. భారత్ మాత అంటే కాషాయరంగు కాదని, మతం ముసుగులో దేశాన్ని విభజించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. గాడ్సే వాదంతో పోరాడాలంటే గాంధేయవాదమే సరైనదని, మనువాదం నుంచి మనం విముక్తిపొందాలని, అంబేద్కర్ ఆశయ సాధనకోసం పోరాడాలని, కొందరు ఒక ప్రయోజనంకోసం విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, రోహిత్ చట్టం తెచ్చేవరకు పోరాడుతూనే వుంటామని అన్నారు.

హైదరాబాద్ సభ తరువాత కన్హయ్య విజయవాడకు బయలుదేరారు. విజయవాడలో కన్హయ్య సభను జరగనివ్వమని భారతీయ జనతాపార్టీ యువమొర్చా నాయకులు బుధవారంనాడే బెదిరించారు. అందుకు స్పందించిన సీపీఐ నాయకులు కన్హయ్య సభకు అడ్డుపడితే పరిణామాలు తీవ్రంగా వుంటాయని, విజయవాడలో మా పార్టీ సత్తా ఏమిటో బీజేపీకి చూపిస్తామని హెచ్చరించారు.

Click on Image to Read:

roja-ramoji

NTR-Health-Scheme

jagan

tdp-kadapa

spy-reddy

sakshi1

venkaiah-rss

tdp-leaders

peddireddy1

jagan-nellore

jagan1

jagan

mother-and-child

tdp-women

sakshi-tdp

cbn

peddireddy

First Published:  24 March 2016 1:20 AM GMT
Next Story