Telugu Global
International

బ్రస్సెల్స్ బాంబు పేలుళ్ల‌లో ఇన్ఫోసిస్ ఉద్యోగి గ‌ల్లంతు!

బెల్జియం రాజ‌ధాని బ్రస్సెల్స్ లో  జ‌రిగిన బాండుపేలుళ్ల ఘ‌ట‌న‌లో ఒక భార‌త ఉద్యోగి గ‌ల్లంత‌యిన‌ట్టుగా తెలుస్తోంది. బెంగలూరు సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం ఇన్ఫోసిస్‌లో ప‌నిచేస్తున్న రాఘ‌వేంద్ర గ‌ణేశ‌న్  ఉద్యోగ నిమిత్తం యూర‌ప్‌కి వెళ్లాడు. భార‌త‌ విదేశాంగ శాఖామంత్రి సుష్మా స్వ‌రాజ్ రాఘ‌వేంద్ర గణేశ‌న్ కనిపించ‌డం లేద‌ని, ఆయ‌న‌కోసం పోలీసులు వెతుకుతున్నార‌ని ట్విట్ల‌ర్లో పేర్కొన్నారు. రాఘ‌వేంద్ర గ‌ణేశ‌న్  ప్ర‌తిరోజూ బాంబుదాడి జ‌రిగిన మెట్రో స్టెష‌న్ నుండే ఆఫీస్‌కి ప్ర‌యాణం చేస్తుంటాడ‌ని, బాంబుదాడి త‌రువాత అత‌ని ఫోన్ కానీ, వీడియో కాల్ […]

బ్రస్సెల్స్ బాంబు పేలుళ్ల‌లో ఇన్ఫోసిస్ ఉద్యోగి గ‌ల్లంతు!
X

బెల్జియం రాజ‌ధాని బ్రస్సెల్స్ లో జ‌రిగిన బాండుపేలుళ్ల ఘ‌ట‌న‌లో ఒక భార‌త ఉద్యోగి గ‌ల్లంత‌యిన‌ట్టుగా తెలుస్తోంది. బెంగలూరు సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం ఇన్ఫోసిస్‌లో ప‌నిచేస్తున్న రాఘ‌వేంద్ర గ‌ణేశ‌న్ ఉద్యోగ నిమిత్తం యూర‌ప్‌కి వెళ్లాడు. భార‌త‌ విదేశాంగ శాఖామంత్రి సుష్మా స్వ‌రాజ్ రాఘ‌వేంద్ర గణేశ‌న్ కనిపించ‌డం లేద‌ని, ఆయ‌న‌కోసం పోలీసులు వెతుకుతున్నార‌ని ట్విట్ల‌ర్లో పేర్కొన్నారు. రాఘ‌వేంద్ర గ‌ణేశ‌న్ ప్ర‌తిరోజూ బాంబుదాడి జ‌రిగిన మెట్రో స్టెష‌న్ నుండే ఆఫీస్‌కి ప్ర‌యాణం చేస్తుంటాడ‌ని, బాంబుదాడి త‌రువాత అత‌ని ఫోన్ కానీ, వీడియో కాల్ కానీ క‌ల‌వ‌డం లేద‌ని అత‌ని త‌ల్లి అన్న‌పూర్ణి గ‌ణేశ‌న్‌ చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది. రాఘవేంద్ర స్నేహితుల‌ను సంప్ర‌దించ‌గా వారు, అత‌ను ఆఫీస్‌కే రాలేద‌ని చెప్ప‌డంతో అత‌ని కుటుంబ స‌భ్యులు తీవ్రంగా ఆందోళ‌న చెందుతున్నారు. రాఘ‌వేంద్ర గ‌త నాలుగేళ్లుగా అక్క‌డే ఉంటున్నాడ‌ని, బాంబుపేలుళ్ల ఘ‌ట‌న ముందురోజు రాత్రి త‌న‌తో స్కైప్‌లో మాట్లాడాడ‌ని త‌ల్లి తెలిపింది. బ్ర‌స్సెల్స్‌లో విమానాశ్ర‌యంతో పాటు మెట్రో స్టేష‌న్‌లో కూడా బాంబు దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ మ‌ర‌ణించిన‌వారిని గుర్తుప‌ట్ట‌లేనంత‌గా శ‌రీరాలు విచ్చిన్న‌మ‌య్యాయ‌ని బెల్జియం ఆరోగ్య‌శాఖా మంత్రి ప్ర‌క‌టించారు.

Next Story