Telugu Global
Cinema & Entertainment

జనతా గ్యారేజీ టీమ్ కే షాకిచ్చిన మోహన్ లాల్

ఇప్పటికే ఒకసారి తన యాక్టింగ్ స్కిల్స్ తో జనతా గ్యారేజీ యూనిట్ కు షాకిచ్చాడు మోహన్ లాల్. సన్నివేశాల్లో అతను నటించే తీరు, పండించే హావభావాలు చూసి యూనిట్ సభ్యులకు పిచ్చెక్కిపోతోందట. అయితే తాజాగా మోహన్ లాల్ షాకిచ్చిన తన నటనతో కాదు. మరో  యాంగిల్ లో నిర్మాతలకు షాకిచ్చాడట. జనతా గ్యారేజీ సినిమాకు సంబంధించి మైత్రీ మూవీస్ సంస్థ…. మలయాళ హక్కుల్ని మోహన్ లాల్ కే ఇచ్చేసింది. ఇప్పటికే కొరటాల శివ, ఎన్టీఆర్ ను సహ-నిర్మాతలుగా […]

జనతా గ్యారేజీ టీమ్ కే షాకిచ్చిన మోహన్ లాల్
X
ఇప్పటికే ఒకసారి తన యాక్టింగ్ స్కిల్స్ తో జనతా గ్యారేజీ యూనిట్ కు షాకిచ్చాడు మోహన్ లాల్. సన్నివేశాల్లో అతను నటించే తీరు, పండించే హావభావాలు చూసి యూనిట్ సభ్యులకు పిచ్చెక్కిపోతోందట. అయితే తాజాగా మోహన్ లాల్ షాకిచ్చిన తన నటనతో కాదు. మరో యాంగిల్ లో నిర్మాతలకు షాకిచ్చాడట. జనతా గ్యారేజీ సినిమాకు సంబంధించి మైత్రీ మూవీస్ సంస్థ…. మలయాళ హక్కుల్ని మోహన్ లాల్ కే ఇచ్చేసింది. ఇప్పటికే కొరటాల శివ, ఎన్టీఆర్ ను సహ-నిర్మాతలుగా తీసుకున్న ఆ సంస్థ…. మోహన్ లాల్ కు కూడా కొంత మొత్తాన్ని ముట్టజెప్పి, మిగతా డబ్బుకు ప్రతిగా మలయాళ హక్కుల్ని రాసిచ్చేసిందట. అయితే ఇక్కడే మోహన్ లాల్ ప్రొడ్యూసర్ కు చుక్కలు చూపించాడు. నిర్మాతలు మోహన్ లాల్ కు కోటిన్నరకు జనతా గ్యారేజీ హక్కులు అమ్మేస్తే…. ఆ హక్కుల్ని మరో మలయాళీ డిస్ట్రిబ్యూటర్ కు ఏకంగా 5 కోట్ల రూపాయలకు మోహన్ లాల్ అమ్మేసుకున్నారట. దీంతో షాకవ్వడం యూనిట్ వంతయింది. ప్రస్తుతం యూనిట్ అంతా ఈ మేటర్ పైనే చెవులు కొరుక్కుంటోందట.
First Published:  23 March 2016 6:25 AM GMT
Next Story