Telugu Global
Cinema & Entertainment

 పనికిరాదనుకున్న పిల్ల దూసుకుపోతోంది...?

నానితో కృష్ణగాడి వీరప్రేమగాథ అనే సినిమా చేసింది మెహరీన్. అదే ఆమెకు తొలి సినిమా. సినిమా హిట్టయింది. నానికి మంచి పేరొచ్చింది. దర్శకుడు కూడా సక్సెస్ అయ్యాడు. కానీ ప్రతి రివ్యూలో హీరోయిన్ పై మాత్రం విమర్శలు చెలరేగాయి. అమ్మాయి కాస్త బొద్దుగా ఉంది భవిష్యత్ కష్టమే అని రివ్యూలు రాశారు చాలామంది. కానీ మెహరీన్ మాత్రం దూసుకుపోతోంది. వరుస అవకాశాలతో తోటి హీరోయిన్లకు పోటీనిచ్చే రేంజ్ కు ఎదిగిపోయింది. కృష్ణగాడి వీరప్రేమగాధ విడుదలైన వెంటనే దర్శకుడు […]

 పనికిరాదనుకున్న పిల్ల దూసుకుపోతోంది...?
X
నానితో కృష్ణగాడి వీరప్రేమగాథ అనే సినిమా చేసింది మెహరీన్. అదే ఆమెకు తొలి సినిమా. సినిమా హిట్టయింది. నానికి మంచి పేరొచ్చింది. దర్శకుడు కూడా సక్సెస్ అయ్యాడు. కానీ ప్రతి రివ్యూలో హీరోయిన్ పై మాత్రం విమర్శలు చెలరేగాయి. అమ్మాయి కాస్త బొద్దుగా ఉంది భవిష్యత్ కష్టమే అని రివ్యూలు రాశారు చాలామంది. కానీ మెహరీన్ మాత్రం దూసుకుపోతోంది. వరుస అవకాశాలతో తోటి హీరోయిన్లకు పోటీనిచ్చే రేంజ్ కు ఎదిగిపోయింది. కృష్ణగాడి వీరప్రేమగాధ విడుదలైన వెంటనే దర్శకుడు పూరి జగన్నాధ్ కంట్లో పడింది. కల్యాణ్ రామ్ సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నాడు పూరి. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో ఆఫర్ కొట్టేసింది. ఈసారి ఏకంగా మెగా కాంపౌండ్ లోకి ఎంటరైంది. వరుణ్ తేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. నిజానికి ఈ సినిమాలో మొదట కాజల్ ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ మెహరీన్ లుక్స్ కు ఫిదా అయిపోయిన వరుణ్ తేజ ఆమెను కావాలని తన సినిమాలోకి తీసుకున్నాడని తెలుస్తోంది.
Click Here For Mehreen Stills
Mehreen-FI
oopiri
pawan1
parinthi-chopra
regina
First Published:  22 March 2016 11:11 PM GMT
Next Story