ఈసారి కమల్, రజనీ మధ్య పోరు తప్పదు
తమిళనాడు వాళ్లిద్దరూ సూపర్ స్టార్లు. వాళ్ల సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వచ్చాయంటే సునామీనే. కానీ వస్తాయనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు తప్పుకుంటున్నారు. దీంతో రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాల మధ్య ఈ మధ్య కాలంలో ఎలాంటి యుద్ధం జరగలేదు. అయితే ఈసారి మాత్రం ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య వార్ షురూ అయింది. ఇది మిస్సయ్యేది కాదు. ఎందుకంటే… వీళ్లు తలపడేది సిల్వర్ స్క్రీన్ పై కాదు… క్రికెట్ స్టేడియంలో. అవును… కమల్, రజనీ ఇద్దరూ వేర్వేరు […]
BY sarvi19 March 2016 6:22 AM GMT
X
sarvi Updated On: 19 March 2016 6:36 AM GMT
తమిళనాడు వాళ్లిద్దరూ సూపర్ స్టార్లు. వాళ్ల సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వచ్చాయంటే సునామీనే. కానీ వస్తాయనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు తప్పుకుంటున్నారు. దీంతో రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాల మధ్య ఈ మధ్య కాలంలో ఎలాంటి యుద్ధం జరగలేదు. అయితే ఈసారి మాత్రం ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య వార్ షురూ అయింది. ఇది మిస్సయ్యేది కాదు. ఎందుకంటే… వీళ్లు తలపడేది సిల్వర్ స్క్రీన్ పై కాదు… క్రికెట్ స్టేడియంలో. అవును… కమల్, రజనీ ఇద్దరూ వేర్వేరు గ్రూపులకు ప్రాతినిధ్యం వహిస్తూ క్రికెట్ మ్యాచులతో తలపడబోతున్నారు. వచ్చేనెల 17న నడిగర్ సంఘం ఆధ్వర్యంలో జరగనున్న ఈ మ్యాచుల్లో వీళ్లిద్దరూ హోరాహోరీగా తలపడనున్నారు. భారీ వరదలకు దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు కట్టించాలనే సమున్నత లక్ష్యానికి నిధులు సేకరించడం కోసమే… కమల్, రజనీ ఇలా ఫేస్ టు ఫేస్ తలపడ్డానికి సిద్ధమయ్యారు. మరి ఈ పోరు గెలుపెవరిదో తెలియాలంటే…. వచ్చేనెల 17 వరకు ఆగాల్సిందే. అన్నట్టు ఈ మ్యాచులకు సంబంధించి ఇవాల్టి నుంచి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది.
Next Story