Telugu Global
Cinema & Entertainment

అరె... కొద్దిలో వెంకీని మిస్ అయ్యాడు

స్టార్ హీరోలతో సినిమా చేయాలనే కోరిక రవిబాబుకు ఎప్పట్నుంచో ఉంది. చిన్న సినిమాలతోనే పెద్ద విజయాలు అందిస్తున్న ఈ దర్శకుడు కమ్ నటుడు…. తాజాగా వెంకీ కోసం తెగ ప్రయత్నించాడు. విక్టరీ వెంకటేష్ ను హీరోగా పెట్టి ఓ ప్రయోగాత్మక థ్రిల్లర్ కథను తెరకెక్కించాలనుకున్నాడు. కానీ వెంకటేష్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో బాబు బంగారం అనే సినిమా చేస్తున్నాడు. అది కంప్లీట్ అయిన వెంటనే…. సాలా ఖదూస్ అనే బాలీవుడ్ సినిమాను రీమేక్ […]

అరె... కొద్దిలో వెంకీని మిస్ అయ్యాడు
X
స్టార్ హీరోలతో సినిమా చేయాలనే కోరిక రవిబాబుకు ఎప్పట్నుంచో ఉంది. చిన్న సినిమాలతోనే పెద్ద విజయాలు అందిస్తున్న ఈ దర్శకుడు కమ్ నటుడు…. తాజాగా వెంకీ కోసం తెగ ప్రయత్నించాడు. విక్టరీ వెంకటేష్ ను హీరోగా పెట్టి ఓ ప్రయోగాత్మక థ్రిల్లర్ కథను తెరకెక్కించాలనుకున్నాడు. కానీ వెంకటేష్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో బాబు బంగారం అనే సినిమా చేస్తున్నాడు. అది కంప్లీట్ అయిన వెంటనే…. సాలా ఖదూస్ అనే బాలీవుడ్ సినిమాను రీమేక్ చేయడానికి రెడీ అయిపోయాడు. దీంతో రవిబాబు మళ్లీ తన పాత పంథాలోకి వచ్చేశాడు. అదిగో అనే టైటిల్ తో అంతా కొత్తవాళ్లతో మరో సినిమా షురూ చేశాడు. తన సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పైనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓపెనింగ్ కూడా సైలెంట్ గా అయిపోయింది. అవును సినిమాతో సంచలనం సృష్టించిన ఈ క్రియేటివ్ దర్శకుడు…. తాజా చిత్రానికి ఎలాంటి కథాంశాన్ని ఎంచుకున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
First Published:  19 March 2016 6:29 AM GMT
Next Story