Telugu Global
Cinema & Entertainment

వాళ్లు ఏజ్ బార్ కాదు..! 

చూసిన హీరోయిన్  ను మ‌ళ్లీ మ‌ళ్లీ చూడ‌టం  మన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు  ఇష్టం ఉండ‌దు.అందుకే కొత్త హీరోయిన్స్ కు ఎప్పుడూ మ‌న టాలీవుడ్ గేట్స్ తెరిచే ఉంటాయి.  హీరో కెరీర్  కు  ఒక పులిస్టాప్ ఉండ‌దు. కానీ హీరోయిన్ కెరీర్ కు మాత్రం ఉంటుంది.  వాళ్ల‌కు మ్యారేజ్ అయ్యిందంటే  సోలో హీరోయిన్ స్టేట‌స్ మిస్ అయిన‌ట్లే.  అదే  60 ఏళ్ల దాటిన  హీరోకు మాత్రం ఏ విధ‌మైన   ప‌ట్టింపులు ఉండ‌వన్న‌ట్లు చేస్తుంటారు.   అయితే తెలుగులో […]

వాళ్లు ఏజ్ బార్ కాదు..! 
X
చూసిన హీరోయిన్ ను మ‌ళ్లీ మ‌ళ్లీ చూడ‌టం మన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఇష్టం ఉండ‌దు.అందుకే కొత్త హీరోయిన్స్ కు ఎప్పుడూ మ‌న టాలీవుడ్ గేట్స్ తెరిచే ఉంటాయి. హీరో కెరీర్ కు ఒక పులిస్టాప్ ఉండ‌దు. కానీ హీరోయిన్ కెరీర్ కు మాత్రం ఉంటుంది. వాళ్ల‌కు మ్యారేజ్ అయ్యిందంటే సోలో హీరోయిన్ స్టేట‌స్ మిస్ అయిన‌ట్లే. అదే 60 ఏళ్ల దాటిన హీరోకు మాత్రం ఏ విధ‌మైన ప‌ట్టింపులు ఉండ‌వన్న‌ట్లు చేస్తుంటారు.
అయితే తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే ట్రెండ్ మారుతుంది. వ‌యుసు తో నిమిత్తం లేకుండా..ఆడియ‌న్స్ వైవిధ్యానికి ప్రాధ్యాన్య‌త ఇస్తున్నారు. హీరోయిన్ కొత్త వాళ్లా..పాత వాళ్ల అనే లెక్క‌లు వేయ‌కుండా..వాళ్లు చేసిన రోల్స్ ఎటువంటివి…అవి ఎంత వ‌ర‌కు ఇంప్రెస్ చేస్తున్నాయి అనే కాలిక్యులేష‌న్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తుండ‌టంతో.. అనుష్క‌, త్రిష‌, కాజ‌ల్, న‌య‌న‌తార వంటి ముద్దుగుమ్మలు.. త‌మ వ‌య‌సు 30 ఏళ్లు దాటిన స‌క్సెస్ లీగ్ లో టాప్ హీరోయిన్స్ గా హ‌ల్ చల్ చేస్తున్నారు. ఇదొక శుభా ప‌రిణామం మ‌రి. అనుష్క ఏజ్ ఇప్పుడు 34 .. త్రిష 32 సంవ‌త్స‌రాలు.. న‌య‌న‌తార కు 30 సంవ‌త్స‌రాలు నిండినాయి.కాజ‌ల్ కు కూడా ఈ మ‌ధ్య‌నే 30 వ సంవ‌త్స‌రం లో ఎంట‌ర్ అయ్యింది. ఈ హీరోయిన్స్ అంతా ప్ర‌స్తుతం చేతినిండా చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా వున్నారు మ‌రి.
First Published:  18 March 2016 7:41 AM GMT
Next Story