Telugu Global
Cinema & Entertainment

పవన్ దెబ్బకు ష‌క‌ల‌క శంక‌ర్ షేక్ అయ్యాడా ?

ఏదైనా శృతి మించితే రాగం స‌రిగ్గా రాదు అంటారు. ష‌క‌ల‌క శంక‌ర్ విష‌యంలో ఇదే జ‌రిగిన‌ట్లు ఫిల్మ్ న‌గ‌ర్ లో గుస గుస‌లు వినిపిస్తున్నాయి. కమెడియ‌న్ గా ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా వున్న శంక‌ర్…! ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్దార్ చిత్రంలో అవ‌కాశం సంపాదించాడు. అయితే త‌న పనేదో తాను చూసుకుంటే ఇండ‌స్ట్రీలో ప‌ది కాలాల పాటు వుంటారు. అలా కాకుండా.. వేరే వాళ్లు చేసే ప‌నిని విమ‌ర్శిస్తూ.. త‌నే మోనార్క్ అనే లెవ‌ల్లో బిహేవ్ […]

పవన్ దెబ్బకు ష‌క‌ల‌క శంక‌ర్  షేక్ అయ్యాడా ?
X

ఏదైనా శృతి మించితే రాగం స‌రిగ్గా రాదు అంటారు. ష‌క‌ల‌క శంక‌ర్ విష‌యంలో ఇదే జ‌రిగిన‌ట్లు ఫిల్మ్ న‌గ‌ర్ లో గుస గుస‌లు వినిపిస్తున్నాయి. కమెడియ‌న్ గా ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా వున్న శంక‌ర్…! ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్దార్ చిత్రంలో అవ‌కాశం సంపాదించాడు. అయితే త‌న పనేదో తాను చూసుకుంటే ఇండ‌స్ట్రీలో ప‌ది కాలాల పాటు వుంటారు. అలా కాకుండా.. వేరే వాళ్లు చేసే ప‌నిని విమ‌ర్శిస్తూ.. త‌నే మోనార్క్ అనే లెవ‌ల్లో బిహేవ్ చేస్తే.. చాప్ట‌ర్ చాలా ఫాస్ట్ గా క్లోజ్ అవుద్ది. క‌చ్చితంగా ఇదే త‌ర‌హా బిహేవియ‌ర్ కారణంగా ష‌క‌ల‌క శంకర్ కష్టాలు అనుభవిస్తున్నాడని ఫిలిం నగర్ టాక్.

స‌ర్దార్ చిత్ర యూనిట్ లో షకలక శంకర్ కాస్త అతిగా బిహేవ్ చేశాడని అంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌సారి పిలిచి పద్ధతి మార్చుకోమని మంచిగా చెప్పినా వినిపించుకోకుండా… చివ‌రకు స‌ర్దార్ చిత్ర ద‌ర్శ‌కుడు బాబీని సైతం వెట‌కారం చేసే స్థాయికి చేరుకున్నాడట‌. ఎంత‌గా అంటే డైరెక్ట‌ర్ డిస్ట్ర‌బ్ అయ్యేంత‌గా.. దీంతో ఈ విష‌యం మ‌రోసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ దృష్టికి వెళ్ల‌టం.. చివ‌ర‌కు శంక‌ర్ ను గ‌ట్టిగా రెండు పీక‌టం జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది. ఎదిగిన కొద్ది ఒద‌గ‌డం నేర్చుకోక‌ పోతే ఎటువంటి పనిలోనైన ఆటుపోట్లు తప్పవు.

Click on Image to Read:

chiru

varun-kajal

ntr-mahesh

pawan

bahubali-2
trivikram-rajamouli
First Published:  17 March 2016 10:27 AM GMT
Next Story