Telugu Global
Cinema & Entertainment

 ఒక్క రోజు తేడాతో వస్తున్న మహేష్, ఎన్టీఆర్

మహేష్, ఎన్టీఆర్ కేవలం ఒక్క రోజు తేడాతో దూసుకొస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య పోటీ మాత్రం లేదు. అదేంటి… స్టార్ హీరోల మధ్య పోటీ లేకుండా ఉంటుందా… అవును… నిజంగానే వాళ్ల మధ్య వార్ లేదు. ఎందుకంటే… మహేష్ తన సినిమాతో రంగంలోకి దూకుతుంటే… అదే సమయంలో ఎన్టీఆర్ తన కొత్త సినిమా టీజర్ తో వస్తున్నాడు. అందుకే పోటీ అనేది ఇక్కడ అప్రస్తుతం. మహేష్ నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నారు. ఈ […]

 ఒక్క రోజు తేడాతో వస్తున్న మహేష్, ఎన్టీఆర్
X
మహేష్, ఎన్టీఆర్ కేవలం ఒక్క రోజు తేడాతో దూసుకొస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య పోటీ మాత్రం లేదు. అదేంటి… స్టార్ హీరోల మధ్య పోటీ లేకుండా ఉంటుందా… అవును… నిజంగానే వాళ్ల మధ్య వార్ లేదు. ఎందుకంటే… మహేష్ తన సినిమాతో రంగంలోకి దూకుతుంటే… అదే సమయంలో ఎన్టీఆర్ తన కొత్త సినిమా టీజర్ తో వస్తున్నాడు. అందుకే పోటీ అనేది ఇక్కడ అప్రస్తుతం. మహేష్ నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయిందనే విషయాన్ని స్వయంగా మహేష్ ప్రకటించాడు. ఇక మహేష్ కంటే ఒక్క రోజు ముందు… తన కొత్త సినిమా జనతా గ్యారేజీ టీజర్ ను ఎన్టీఆర్ తీసుకొస్తున్నాడు. ఆ రోజున టీజర్ విడుదల చేయడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. మే 28…. నందమూరి నటసార్వభౌముడి జయంతి. అందుకే ఆ రోజున జనతా గ్యారేజీ టీజర్ తీసుకురావాలని తారక్ భావిస్తున్నాడు.
First Published:  17 March 2016 2:31 AM GMT
Next Story