Telugu Global
Health & Life Style

కేజ్రీవాల్… కాబోయే అమ్మ‌ల‌కు ఆప్త‌బంధువు ! అమెరికాకే ఆద‌ర్శ‌ప్రాయుడు!

ఢిల్లీలో కొత్త ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల జీవితాల‌ను మార్చేస్తోంద‌ని…టివిలో ప్ర‌క‌ట‌న‌లు చూస్తున్నాం. ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ నిజంగానే మంచి మార్పుల‌ను ఆచ‌ర‌ణ‌లోకి తెస్తున్నారు. ఆయ‌న కాబోయే త‌ల్లుల‌కోసం ప్ర‌వేశ‌పెట్టిన ఉచిత మెడిక‌ల్ క్యాంపులు ఇప్పుడు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు అందుకుంటున్నాయి. గ‌ర్భ‌వ‌తి అయిన ఒక మ‌హిళ‌కు పావుగంట‌లో ప‌రీక్ష‌లు పూర్తి చేసి, వెనువెంటనే స‌రైన చికిత్స అందించి ఇంటికి పంపుతున్న అత్యాధునిక వైద్య స‌దుపాయాల స‌మ్మేళ‌నం ఈ ప‌థ‌కం. ఎలాంటి జాప్యం లేకుండా, సాంకేతిక ప‌రిక‌రాలు, స‌రైన సిబ్బంది  స‌హాయంతో అన్నీ […]

కేజ్రీవాల్… కాబోయే అమ్మ‌ల‌కు ఆప్త‌బంధువు !  అమెరికాకే ఆద‌ర్శ‌ప్రాయుడు!
X
Wadhwa,_Vivek
వివేక్ వాద్వా

ఢిల్లీలో కొత్త ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల జీవితాల‌ను మార్చేస్తోంద‌ని…టివిలో ప్ర‌క‌ట‌న‌లు చూస్తున్నాం. ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ నిజంగానే మంచి మార్పుల‌ను ఆచ‌ర‌ణ‌లోకి తెస్తున్నారు. ఆయ‌న కాబోయే త‌ల్లుల‌కోసం ప్ర‌వేశ‌పెట్టిన ఉచిత మెడిక‌ల్ క్యాంపులు ఇప్పుడు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు అందుకుంటున్నాయి. గ‌ర్భ‌వ‌తి అయిన ఒక మ‌హిళ‌కు పావుగంట‌లో ప‌రీక్ష‌లు పూర్తి చేసి, వెనువెంటనే స‌రైన చికిత్స అందించి ఇంటికి పంపుతున్న అత్యాధునిక వైద్య స‌దుపాయాల స‌మ్మేళ‌నం ఈ ప‌థ‌కం. ఎలాంటి జాప్యం లేకుండా, సాంకేతిక ప‌రిక‌రాలు, స‌రైన సిబ్బంది స‌హాయంతో అన్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోతాయి. గ‌ర్భ‌వ‌తి లోప‌లికి రావ‌డం, ఒక ఫిజీషియ‌న్ ఆమె మెడిక‌ల్ రిపోర్టులు చెక్ చేయ‌డం, అవ‌స‌ర‌మైన ప‌రీక్ష‌లు చేయించ‌డం, ఒక‌వేళ అత్య‌వ‌స‌ర చికిత్స అవ‌స‌ర‌మైతే వెంట‌నే అంబులెన్స్‌ని తెప్పించి వారిని ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించ‌డం, ఆ రిపోర్టుల‌ను బ‌ట్టి స‌ల‌హాలు సూచ‌న‌లు ఇవ్వ‌డం…ఇవ‌న్నీ చ‌క‌చ‌కా ఎలాంటి జాప్యం లేకుండా ఒక‌దానిత‌రువాత ఒక‌టిగా జరిగిపోతున్నాయి.

స‌రైన పోష‌కాహారం లేక‌, ర‌క్త‌లేమితో బాధ‌ప‌డే పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి మ‌హిళ‌ల‌క‌యితే ఇది ఒక పెద్ద వ‌రమ‌నే చెప్పాలి. ఇక్కడ వైద్య‌ప‌రీక్ష‌లు, ఫ‌లితాలు అన్నీ శ‌ర‌వేగంగా ఎల‌క్ట్రానిక్ ప‌ద్ధ‌తుల్లో నిర్వ‌హిస్తున్నారు. పేప‌రు మీద పెన్ను పెట్ట‌కుండానే వైద్య ప్ర‌క్రియ‌ని ముగిస్తున్నారు. పేషంటుకి క‌ట్ట‌మ‌ని ఇచ్చే బిల్లులు లేవు, అలాగే ఇన్సూరెన్స్‌కంపెనీల‌కు పంపే పేప‌ర్లూ లేవు.

ఢిల్లీ ప్ర‌భుత్వం మొహ‌ల్లా (ప్ర‌జ‌లు) క్లినిక్ పేరుతో ఇలాంటి వైద్య‌కేంద్రాలు గత ఏడాది జులై నుండి న‌డుపుతోంది. మొత్తం వెయ్యి మొహ‌ల్లా క్లినిక్‌లను ప్రారంభిస్తున్న‌ట్టుగా కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. ఈ వైద్య ప్ర‌క్రియ‌తో బాధితుల‌కు స‌రైన వైద్యం స‌రైన స‌మ‌యంలో అందుతుంద‌ని, దీనివ‌ల‌న ఆసుప‌త్రిలో ఎమ‌ర్జ‌న్సీ చికిత్స‌లు, వాటిక‌య్యే ఖ‌ర్చు, శ్ర‌మ‌లాంటివి త‌గ్గిపోతాయ‌ని ఢిల్లీ ఆరోగ్య‌శాఖామంత్రి స‌త్యేంద్ర జైన్ అంటున్నారు.

ఇన్‌స్టాంట్ డ‌యాగ్నొసిస్ టెక్నాల‌జీ స్వ‌స్థ స్లేట్ …సూప‌ర్‌!

devices2ఇందులో వాడుతున్న, అప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌ని నిర్దార‌ణ చేసే ఇన్‌స్టాంట్ డ‌యాగ్నొసిస్ టెక్నాల‌జీని స్వ‌స్థ స్లేట్ అని పిలుస్తున్నారు. ఒక కేకు డ‌బ్బా సైజులో ఉండే ఈ సాంకేతిక పరిక‌రం విలువ 600 డాల‌ర్లు. ఇది 33 సాధార‌ణ మెడిక‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గ‌లుగుతుంది. బ్ల‌డ్‌షుగ‌ర్‌, బ్ల‌డ్ ప్రెజ‌ర్‌, హార్ట్ రేట్‌, హిమోగ్లోబిన్‌, యూరిన్ ప్రొటీన్‌, గ్లూకోజ్‌…ఇలాంటి ప‌రీక్ష‌లే కాక‌, మ‌లేరియా, డెంగ్యూ, హెప‌టైటిస్‌, హెచ్ఐవి, టైఫాయిడ్ లాంటి వ్యాధుల‌ను సైతం గుర్తించ‌గ‌లుగుతుంది. ఒక్కో ప‌రీక్ష‌కు ఒక‌టి లేదా రెండు నిముషాలు మాత్ర‌మే ప‌డుతుంది.

kanav-quote
క‌నోవ్ క‌హాల్

ఈ ప‌రిక‌రాన్ని బ‌యో మెడిక‌ల్ ఇంజినీర్ క‌నోవ్ క‌హాల్ క‌నుగొన్నారు. అమెరికా అరిజోనా స్టేట్ యూనివ‌ర్శిటీలో బ‌యోమెడిక‌ల్ డిపార్ట్‌మెంటులో ఆయ‌న ప‌నిచేసేవారు. అయితే వైద్య‌ప‌రీక్ష‌ల‌ను సులువుచేసే విధానాల రూప‌క‌ల్ప‌న‌కు ఎవ‌రూ ముందుకురావ‌డం లేద‌నే ఆవేదన క‌నోవ్‌లో ఉండేది. దాంతో 2011లో స్వ‌స్థ‌ల‌మైన ఢిల్లీకి తిరిగి వ‌చ్చేసి స్వ‌స్థ స్లేట్‌ని రూపొందించారు.

2013లో దీన్ని రూపొందించ‌గా మొద‌ట జ‌మ్ము కాశ్మీర్‌లో వినియోగించారు. ఇప్పుడు అక్క‌డ 498 క్లినిక్‌ల‌లో ఈ సాంకేతిక ప‌రిక‌రాన్ని వాడుతున్నారు. ప్ర‌స్తుతం దీన్ని మ‌రింత ఆధునీక‌రించి హెల్త్ క్యూబ్ పేరుతో తెస్తున్నారు.

ఢిల్లీలో ఒక ఉచిత వైద్య కేంద్రంలో గ‌ర్భ‌వ‌తుల‌కు అందుతున్న వైద్యాన్ని ద‌గ్గ‌రినుండి గ‌మ‌నించిన వివేక్ వాద్వా అనే భార‌త‌సంత‌తి అమెరిక‌న్ వాషింగ్ట‌న్ పోస్టులో ఈ విష‌యాల‌పై ఆర్టిక‌ల్ రాస్తూ, ఇలాంటి స‌దుపాయం తాను పాశ్చాత్య దేశాల్లోకూడా చూడ‌లేదన్నారు. ఈ విష‌యంలో న్యూఢిల్లీ అమెరికాకే ఆద‌ర్శంగా నిలిచింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. వివేక్ వాద్వా స్టాన్‌ఫార్డ్ యూనివ‌ర్శిటీ, రాక్‌సెంట‌ర్‌లో కార్పొరేట్ పాల‌న‌పై ఫెలోషిప్ చేస్తున్నారు. గ‌తంలోనూ అమెరికాలో ప‌లు ప‌ద‌వులు నిర్వ‌హించారు.

First Published:  14 March 2016 3:38 AM GMT
Next Story