Telugu Global
Health & Life Style

గ‌ర్భాశ‌య‌ మార్పిడి చికిత్స‌...విఫ‌లం!

అమెరికాలో తొలిసారి నిర్వ‌హించిన గ‌ర్భ‌సంచి మార్పిడి చికిత్స ఫెయిల‌య్యింది. ఆప‌రేష‌న్ చేసి తిరిగి ఆ గ‌ర్భ‌సంచిని తీసేయాల్సి ఉంద‌ని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్ర‌క‌టించింది. పుట్టుక‌తోనే గ‌ర్భాశ‌యం లేని లిండ్సే అనే 26ఏళ్ల యువ‌తికి ఈ హాస్ప‌ట‌ల్ వైద్యులు గ‌త నెల 25న గ‌ర్భ‌సంచిని అమ‌ర్చారు. ఈ గ‌ర్భ‌సంచితో ఆమె త‌ల్లి కావ‌చ్చ‌ని డాక్ట‌ర్లు భావించారు. అయితే ఇప్పుడు ఆ అవ‌కాశం లేద‌ని వైద్యులు బుధ‌వారం వెల్ల‌డించారు. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా లిండ్సేకి కొత్త గ‌ర్భ‌సంచిలో స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని […]

గ‌ర్భాశ‌య‌ మార్పిడి చికిత్స‌...విఫ‌లం!
X

అమెరికాలో తొలిసారి నిర్వ‌హించిన గ‌ర్భ‌సంచి మార్పిడి చికిత్స ఫెయిల‌య్యింది. ఆప‌రేష‌న్ చేసి తిరిగి ఆ గ‌ర్భ‌సంచిని తీసేయాల్సి ఉంద‌ని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్ర‌క‌టించింది. పుట్టుక‌తోనే గ‌ర్భాశ‌యం లేని లిండ్సే అనే 26ఏళ్ల యువ‌తికి ఈ హాస్ప‌ట‌ల్ వైద్యులు గ‌త నెల 25న గ‌ర్భ‌సంచిని అమ‌ర్చారు. ఈ గ‌ర్భ‌సంచితో ఆమె త‌ల్లి కావ‌చ్చ‌ని డాక్ట‌ర్లు భావించారు. అయితే ఇప్పుడు ఆ అవ‌కాశం లేద‌ని వైద్యులు బుధ‌వారం వెల్ల‌డించారు.

అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా లిండ్సేకి కొత్త గ‌ర్భ‌సంచిలో స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని డాక్ట‌ర్లు తెలిపారు. మొత్తం ప‌ది గ‌ర్భాశ‌య మార్పిడి ఆప‌రేష‌న్లు చేయాల‌ని ఈ హాస్ప‌ట‌ల్ వైద్యులు సిద్ధ‌మ‌య్యారు. ఇది తొలి ఆప‌రేష‌న్‌. ఇందులో వైఫ‌ల్యం చెందినా వైద్య ప‌రిశోధ‌న‌ల‌ను మ‌రింత ముందుకు తీసుకువెళ్లే క్ర‌మంలో మిగిలిన ఆప‌రేష‌న్ల‌ను కూడా చేస్తామ‌ని, గ‌ర్భ‌సంచిలేని మ‌హిళ‌ల‌కు ఒక మంచి ప‌రిష్కారాన్ని చూపి తీరుతామ‌ని ఈ వైద్యులు అంటున్నారు. స్వీడ‌న్‌లో ఈ త‌ర‌హా ఆపరేష‌న్లు తొమ్మిదింటిని విజ‌య‌వంతంగా చేశారు. వీరిలో ఐదుగురు త‌ల్లులు కూడా కాగ‌లిగారు.

First Published:  11 March 2016 2:27 AM GMT
Next Story