Telugu Global
Cinema & Entertainment

ప‌వ‌న్‌ని ఒక్క‌ఛాన్స్ అడుగుతా!

అంద‌రికీ అభిమానులుంటే ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి మాత్రం భ‌క్తులు ఉంటార‌ని ఇప్ప‌టికే చాలా సంద‌ర్భాల్లో రుజువైంది. ప‌వ‌న్‌ని ఆయ‌న అభిమానులే కాదు, సినీ ఫీల్డ్‌లో ఉన్నవారు కూడా ఆకాశానికి ఎత్తేస్తుంటారు. బండ్ల గ‌ణేశ్, సునీల్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌…ఇలా ఎవ‌రో ఒక‌రు ఎప్పుడూ ప‌వ‌న్ భ‌జ‌న చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ వ‌రుస‌లో ద‌ర్శ‌కుడు మారుతి కూడా చేరాడు. అమ‌లాపురంలో ఒక కాలేజి ఫంక్ష‌న్లో ప్ర‌సంగించిన ఆయ‌న ఆ స‌భ మొత్తం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటోలు, జ‌న‌సేన పార్టీ జెండాల‌తో […]

ప‌వ‌న్‌ని ఒక్క‌ఛాన్స్ అడుగుతా!
X

అంద‌రికీ అభిమానులుంటే ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి మాత్రం భ‌క్తులు ఉంటార‌ని ఇప్ప‌టికే చాలా సంద‌ర్భాల్లో రుజువైంది. ప‌వ‌న్‌ని ఆయ‌న అభిమానులే కాదు, సినీ ఫీల్డ్‌లో ఉన్నవారు కూడా ఆకాశానికి ఎత్తేస్తుంటారు. బండ్ల గ‌ణేశ్, సునీల్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌…ఇలా ఎవ‌రో ఒక‌రు ఎప్పుడూ ప‌వ‌న్ భ‌జ‌న చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ వ‌రుస‌లో ద‌ర్శ‌కుడు మారుతి కూడా చేరాడు. అమ‌లాపురంలో ఒక కాలేజి ఫంక్ష‌న్లో ప్ర‌సంగించిన ఆయ‌న ఆ స‌భ మొత్తం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటోలు, జ‌న‌సేన పార్టీ జెండాల‌తో నిండిపోవ‌డం చూసి ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేశాడు. పవ‌న్ ప్ర‌భావం త‌న‌కు అర్థ‌మైంద‌ని, ఇక్క‌డ‌కు వ‌చ్చాక ప‌వ‌న్‌ని ఒక ఛాన్స్ ఇమ్మ‌ని అడ‌గాల‌ని నిర్ణయించుకున్నాన‌ని మారుతి అన్నాడు. స‌ర్దార్ గబ్బ‌ర్ సింగ్ సెట్ కి వెళ్లాన‌ని, పాట‌లు, ఫైట్ల‌చిత్రీక‌ర‌ణ‌తో షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోందని, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక మంచి సినిమాతో మ‌న‌ముందుకు వ‌స్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. అలాగే అంద‌రు హీరోల‌కు అభిమానులుంటే ప‌వ‌న్‌కి భ‌క్తులుంటార‌ని చెప్పి విద్యార్థుల‌ను ఆక‌ట్టుకుని, వారి లో హుషారు నింపాడు మారుతి.

First Published:  10 March 2016 9:00 PM GMT
Next Story