Telugu Global
Cinema & Entertainment

రిలీజ్ పై క్లారిటీ లేని సర్దార్

అస‌లే ఆయ‌న‌కు గ‌న్స్.. గుర్రాలంటే ఇష్టం. నికార్స్ అయిన పోలీసాఫీసర్. అందురు ఆయనకు కొంచెం తిక్క అంటారు.. దానికి ఓ లెక్కుంది అంటారు. గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం లో ప‌వ‌ర్ స్టార్ ను చూసిన ఆడియ‌న్స్.. ఆ సినిమాకు సీక్వెల్ అంటే ఏ రేంజ్ లో ఆలోచిస్తారో ప‌వ‌ణ్ క‌ళ్యాణ్ కు తెలుసు. అందుకే ఏ విష‌యంలోను కాంప్ర‌మైజ్ కాకుండా.. అభిమానుల అంచ‌నాల్ని మించి ఉండేలా స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాను తీర్చి దిద్దుతున్నారు. పంచ్ డైలాగ్స్.. […]

రిలీజ్ పై క్లారిటీ లేని సర్దార్
X

అస‌లే ఆయ‌న‌కు గ‌న్స్.. గుర్రాలంటే ఇష్టం. నికార్స్ అయిన పోలీసాఫీసర్. అందురు ఆయనకు కొంచెం తిక్క అంటారు.. దానికి ఓ లెక్కుంది అంటారు. గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం లో ప‌వ‌ర్ స్టార్ ను చూసిన ఆడియ‌న్స్.. ఆ సినిమాకు సీక్వెల్ అంటే ఏ రేంజ్ లో ఆలోచిస్తారో ప‌వ‌ణ్ క‌ళ్యాణ్ కు తెలుసు. అందుకే ఏ విష‌యంలోను కాంప్ర‌మైజ్ కాకుండా.. అభిమానుల అంచ‌నాల్ని మించి ఉండేలా స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాను తీర్చి దిద్దుతున్నారు. పంచ్ డైలాగ్స్.. గ‌గ్గ‌ర్పొడిచే పోరాట స‌న్నివేశాలు.. చాల ఉండేలా చూస్తున్నారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అనుకున్నట్టుగా సర్థార్ గబ్బర్సింగ్ సినిమాను ఏప్రిల్ 8న రిలీజ్ చేయటం కుదరక పోవచ్చు అంటున్నారు యూనిట్ వర్గాలు. ఇంకా రెండు పాటలు, ఒక ఫైట్ సీన్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు పెండింగ్లోనే ఉంది. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందన్న విషయంపై క్లారిటీ లేదు. దీంతో అనుకున్న సమయానికి గబ్బర్ సింగ్ అభిమానుల ముందుకు రావటం కష్టంగానే కనిపిస్తోంది. పైగా గబ్బర్ సింగ్ కోసం స్పీడున్నోడు స్పీడ్ తగ్గించుకొని ఎప్రిల్ 22కి పోస్ట్ పోన్ చేసుకున్న విషయం తెలిసిందే. బాబీ ద‌ర్శ‌క‌త్వం..కాజ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా..శ‌ర‌త్ మ‌రారీ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

First Published:  9 March 2016 11:00 PM GMT
Next Story