Telugu Global
Health & Life Style

పిల్ల‌ల‌కు జ్వ‌రం మందు...ఎక్కువైతే ప్ర‌మాదం!

జ్వ‌రం వ‌చ్చిన పిల్ల‌ల‌కు త‌ర‌చుగా పారాసిటమోల్ సిర‌ప్‌లు కాల్‌పాల్‌, డిస్‌ప్రాల్ లాంటివి వాడుతుంటారు చాలామంది త‌ల్లులు. ఒక్కోసారి వైద్యుల స‌ల‌హా లేకుండా కూడా ఎప్పుడు కాస్త ఒళ్లు వెచ్చ‌బ‌డినా వాటిని వేసేస్తుంటారు. ఇలా వీటిని మ‌రీ ఎక్కువ‌గా పిల్ల‌ల‌కు ఇస్తుంటే త‌రువాత కాలంలో వారికి ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని లండ‌న్ యూనివ‌ర్శిటీ కాలేజిలో జ‌న‌ర‌ల్ పీడియాట్రిక్స్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్న ఓ పిల్ల‌ల‌వైద్య నిపుణుడు చెబుతున్నారు. చాలామంది త‌ల్లిదండ్రులు చాలా చిన్న‌పాటి జ్వ‌రానికి కూడా  వీటిని వాడుతుంటార‌ని, అది […]

పిల్ల‌ల‌కు జ్వ‌రం మందు...ఎక్కువైతే ప్ర‌మాదం!
X

జ్వ‌రం వ‌చ్చిన పిల్ల‌ల‌కు త‌ర‌చుగా పారాసిటమోల్ సిర‌ప్‌లు కాల్‌పాల్‌, డిస్‌ప్రాల్ లాంటివి వాడుతుంటారు చాలామంది త‌ల్లులు. ఒక్కోసారి వైద్యుల స‌ల‌హా లేకుండా కూడా ఎప్పుడు కాస్త ఒళ్లు వెచ్చ‌బ‌డినా వాటిని వేసేస్తుంటారు. ఇలా వీటిని మ‌రీ ఎక్కువ‌గా పిల్ల‌ల‌కు ఇస్తుంటే త‌రువాత కాలంలో వారికి ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని లండ‌న్ యూనివ‌ర్శిటీ కాలేజిలో జ‌న‌ర‌ల్ పీడియాట్రిక్స్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్న ఓ పిల్ల‌ల‌వైద్య నిపుణుడు చెబుతున్నారు. చాలామంది త‌ల్లిదండ్రులు చాలా చిన్న‌పాటి జ్వ‌రానికి కూడా వీటిని వాడుతుంటార‌ని, అది మంచిది కాద‌ని ఆ ప్రొఫెస‌ర్ క‌మ్ డాక్ట‌ర్ స‌ల‌హా ఇస్తున్నారు. ఈ మందుల‌ను అన‌వ‌స‌రంగా వాడితే పిల్ల‌ల్లో ఆస్త‌మాతో పాటు లివర్‌, గుండె, కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాదం మ‌రింత‌గా పెరుగుతుంద‌ని ఆ వైద్యుడు హెచ్చ‌రిస్తున్నారు.

Next Story