Telugu Global
Cinema & Entertainment

గబ్బర్ సింగ్ విదేశీయానం

ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ అయిన టైటిల్ సాంగ్ తో పాటు మరికొన్ని సన్నివేశాల్ని హైదరాబాద్ లోనే చిత్రీకరించారు. మరో 3 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఇది కంప్లీట్ అయిన వెంటనే ఫారిన్ టూర్ ప్లాన్ చేశాడు పవన్. హీరోయిన్ కాజల్ తో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లబోతున్నాడు సర్దార్ గబ్బర్ సింగ్. సినిమాకు సంబంధించిన రెండు పాటల్ని…. స్విస్ మంచు కొండల్లో పిక్చరైజ్ […]

గబ్బర్ సింగ్ విదేశీయానం
X
ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ అయిన టైటిల్ సాంగ్ తో పాటు మరికొన్ని సన్నివేశాల్ని హైదరాబాద్ లోనే చిత్రీకరించారు. మరో 3 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఇది కంప్లీట్ అయిన వెంటనే ఫారిన్ టూర్ ప్లాన్ చేశాడు పవన్. హీరోయిన్ కాజల్ తో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లబోతున్నాడు సర్దార్ గబ్బర్ సింగ్. సినిమాకు సంబంధించిన రెండు పాటల్ని…. స్విస్ మంచు కొండల్లో పిక్చరైజ్ చేయబోతున్నారు. ఈ రెండు పాటలతో…. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. మరోవైపు సినిమా ప్రీ-బిజినెస్ కూడా పూర్తయింది. ఈ నెలలోనే సినిమా పాటల్ని మార్కెట్లోకి విడుదల చేసి… వచ్చేనెల 8వ తేదీన మూవీని గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహించాడు. పవన్ క్లోజ్ ఫ్రెండ్ శరత్ మరార్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
First Published:  8 March 2016 3:15 AM GMT
Next Story