Telugu Global
Cinema & Entertainment

రెండేళ్ల కిందటి సినిమా ఇప్పుడు ఫ్రెష్ గా....

కొన్ని సినిమాలు  ఆ క్షణంలో హైప్ క్రియేట్ చేస్తాయి. ఆ మరుక్షణమే మాయమైపోతాయి. ఆ తర్వాత ఆ సినిమా సంగతి ఏమైందో కనుక్కునే నాధుడే ఉండడు. నిజానికి ప్రేక్షకులు కూడా దాదాపు ఆ మూవీని మరిచిపోతుంటారు. అలా మరిచిపోయిన సినిమాను మళ్లీ పరిచయం చేస్తున్నాడు శర్వానంద్. వరుస విజయాలతో ఊపుమీదున్న ఈ హీరో… తన రెండేళ్ల కిందటి సినిమాకు బూజుదులిపాడు. ఫ్రెష్ గా పేరు మార్చి మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దాదాపు రెండేళ్ల కిందట నిత్యామీనన్ […]

రెండేళ్ల కిందటి సినిమా ఇప్పుడు ఫ్రెష్ గా....
X
కొన్ని సినిమాలు ఆ క్షణంలో హైప్ క్రియేట్ చేస్తాయి. ఆ మరుక్షణమే మాయమైపోతాయి. ఆ తర్వాత ఆ సినిమా సంగతి ఏమైందో కనుక్కునే నాధుడే ఉండడు. నిజానికి ప్రేక్షకులు కూడా దాదాపు ఆ మూవీని మరిచిపోతుంటారు. అలా మరిచిపోయిన సినిమాను మళ్లీ పరిచయం చేస్తున్నాడు శర్వానంద్. వరుస విజయాలతో ఊపుమీదున్న ఈ హీరో… తన రెండేళ్ల కిందటి సినిమాకు బూజుదులిపాడు. ఫ్రెష్ గా పేరు మార్చి మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దాదాపు రెండేళ్ల కిందట నిత్యామీనన్ తో కలిసి ఏమిటో ఈ మాయ అనే సినిమా చేశాడు శర్వానంద్. అది మధ్యలోనే అగిపోయింది. ఆ తర్వాత ఆ సినిమాను అంతా మరిచిపోయారు. ఇంతలో శర్వ సుడి తిరిగింది. వరుసగా హిట్స్ పడుతున్నాయి. అందుకే సదరు నిర్మాత అప్పటి “ఏమిటో ఈమాయ” సినిమాకు “రాజాధిరాజ” అనే పేరుపెట్టి…. ఫ్రెష్ కలరింగ్ ఇచ్చి రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. మరి ఎక్స్ ప్రెస్ రాజా సక్సెస్ అయిన ఊపులో ఇది కూడా హిట్టవుతుందా…. వెయిట్ అండ్ సీ…
First Published:  4 March 2016 12:09 AM GMT
Next Story