Telugu Global
NEWS

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల

దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.  బెంగాల్,  తమిళనాడు, కేరళ, అసోంతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో  కోడ్ అమలులోకి వచ్చింది.  అసోం ఎన్నికలు రెండు విడతల్లో జరుగుతాయి. బెంగాల్ ఎన్నికలు ఆరు విడుతల్లో జరుగుతాయి.  కేరళ, తమిళనాడు, పుదిచ్చేరి ఎన్నికలను ఒకే విడతలో నిర్వహిస్తారు. తొలి విడత ఎన్నికలు ఏప్రిల్ నాలుగున జరుగుతాయి.  ఏప్రిల్ 17న రెండో విడత, ఏప్రిల్ 21న మూడో […]

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
X

దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోంతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో కోడ్ అమలులోకి వచ్చింది. అసోం ఎన్నికలు రెండు విడతల్లో జరుగుతాయి. బెంగాల్ ఎన్నికలు ఆరు విడుతల్లో జరుగుతాయి. కేరళ, తమిళనాడు, పుదిచ్చేరి ఎన్నికలను ఒకే విడతలో నిర్వహిస్తారు.

తొలి విడత ఎన్నికలు ఏప్రిల్ నాలుగున జరుగుతాయి. ఏప్రిల్ 17న రెండో విడత, ఏప్రిల్ 21న మూడో విడత, ఏప్రిల్ 25న నాలుగో విడత ఎన్నికలు జరుగుతాయి. ఐదో విడత ఎన్నికలు ఏప్రిల్ 30, ఆరో విడత మే 5 జరుగుతాయి. మే 19న కౌంటింగ్ నిర్వహిస్తారు. అసోంలో 126, తమిళనాడులో 234, బెంగాల్లో 294, పుదుచ్చేరిలో 30 శాసన సభా స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

Next Story