Telugu Global
Others

నాలుగునెల‌ల చిన్నారి...రెండునెలల్లో 20 హార్ట్ ఎటాక్స్‌!

నాలుగునెల‌ల ఆ చిన్నారి రెండునెల్ల‌లో 20సార్లు హార్ట్ ఎటాక్‌కి గుర‌య్యింది. అయినా బ‌తికి మృత్యుంజ‌యురాలిగా నిలిచింది. ఈ ప‌రిస్థితుల్లోనే ఆమెకు గుండె ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. షోలాపూర్‌కి చెందిన అదితి గిల్‌బిలే అనే ఈ చిన్నారి కొన్ని నెలల్లోనే కోలుకుని ఆరోగ్యంగా ఉంటుంద‌ని వైద్యులు తెలిపారు. అదితికి వ‌చ్చిన గుండెజ‌బ్బు మూడుల‌క్ష‌ల మందిలో ఒక‌రికి వ‌స్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు.  పుట్టుక‌తోనే వ‌చ్చిన ఈ లోపాన్ని అనామ‌ల‌స్ లెఫ్ట్ క‌రొన‌రీ ఫ్రం ప‌ల్మ‌న‌రీ ఆర్ట‌రీ అంటారు. శ‌రీరానికి ఆక్సిజ‌న్‌ని అందించే […]

నాలుగునెల‌ల చిన్నారి...రెండునెలల్లో 20 హార్ట్ ఎటాక్స్‌!
X

నాలుగునెల‌ల ఆ చిన్నారి రెండునెల్ల‌లో 20సార్లు హార్ట్ ఎటాక్‌కి గుర‌య్యింది. అయినా బ‌తికి మృత్యుంజ‌యురాలిగా నిలిచింది. ఈ ప‌రిస్థితుల్లోనే ఆమెకు గుండె ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. షోలాపూర్‌కి చెందిన అదితి గిల్‌బిలే అనే ఈ చిన్నారి కొన్ని నెలల్లోనే కోలుకుని ఆరోగ్యంగా ఉంటుంద‌ని వైద్యులు తెలిపారు. అదితికి వ‌చ్చిన గుండెజ‌బ్బు మూడుల‌క్ష‌ల మందిలో ఒక‌రికి వ‌స్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు. పుట్టుక‌తోనే వ‌చ్చిన ఈ లోపాన్ని అనామ‌ల‌స్ లెఫ్ట్ క‌రొన‌రీ ఫ్రం ప‌ల్మ‌న‌రీ ఆర్ట‌రీ అంటారు. శ‌రీరానికి ఆక్సిజ‌న్‌ని అందించే గుండెలోని ప్ర‌ధాన జ‌ఠ‌రికలో లోపం వ‌ల‌న ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. దీని కార‌ణంగా ఆమె గుండె చాలా త‌క్కువ ర‌క్తాన్ని మాత్ర‌మే తీసుకొన‌గ‌లుగుతుంది. దాంతో చిన్నారి అనేక‌సార్లు గుండెపోటుకి గుర‌యింది. పుట్టుక‌తో వ‌చ్చే అన్ని గుండె వ్యాధుల్లో ఇది 0.25 నుండి 0.5శాతం వ‌ర‌కు మాత్ర‌మే ఉంటుంది.

జ‌న‌వ‌రిలో, అదితికి రెండునెల‌ల వ‌య‌సపుడు త‌న‌కు శ్వాస‌తీసుకోవ‌డంలో ఇబ్బంది మొద‌లైంది. అలాగే పాలు తాగ‌లేక అవ‌స్థ ప‌డుతుంటే త‌ల్లిదండ్రులు ఆసుప‌త్రికి తీసుకువెళ్లారు. డాక్ట‌ర్లు పాప‌ని పుణె తీసుకువెళ్ల‌మ‌న్నారు. అక్క‌డి డాక్ట‌ర్లు ఆమెకున్న స‌మ‌స్య‌ను గుర్తించారు.

అదితికి క్లిష్ట‌మైన ఆప‌రేష‌న్‌ని నిర్వ‌హించి ప‌రిస్థితిని స‌రిచేశారు. ఈ స‌ర్జ‌రీ చేసిన వైద్యులు, ఇది చాలా సున్నితంగా చేయాల్సిన ఆప‌రేష‌న్ అనీ, ఒక‌టి నుండి రెండు మిల్లీ మీట‌ర్ల గుండె నాళాలకు హాని క‌ల‌గ‌కుండా, అత్యంత సున్నితంగా ఈ ఆప‌రేష‌న్ నిర్వ‌హించామ‌ని, ఆ స‌మయంలో బేబీ గుండె 10నుండి 15శాతం మాత్ర‌మే ప‌నిచేసింద‌ని తెలిపారు. బేబీ గుండె బ‌ల‌హీనంగా ఉన్నందున ఆమెకు మూడురోజులు మందులు, డ‌యాల‌సిస్ అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని, కోలుకున్నాక ఇంటికి పంపుతామ‌ని వెల్ల‌డించారు.

First Published:  2 March 2016 1:01 PM GMT
Next Story