Telugu Global
Cinema & Entertainment

మెగాస్టార్ జుంబా...జుంబా....

తన 150వ సినిమా కోసం సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాడు మెగాస్టార్. ఓవైపు కూతురు శ్రీజ పెళ్లి ఏర్పాట్లు చూస్తూనే మరోవైపు 150వ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. టైం చాలా తక్కువగా ఉంది. ఈ సమ్మర్ లోనే కత్తి రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఓ వైపు కసరత్తులు చేసి పర్ ఫెక్ట్ ఫిజిక్ తెచ్చుకోవాలి. మరోవైపు ఫుల్ ప్రాక్టీస్ చేసి డాన్సింగ్ పై పట్టుసాధించాలి. వీటన్నింటికీ సమయం సరిపోదు. అందుకే చిరంజీవి ఇప్పుడు ఓ […]

మెగాస్టార్ జుంబా...జుంబా....
X
తన 150వ సినిమా కోసం సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాడు మెగాస్టార్. ఓవైపు కూతురు శ్రీజ పెళ్లి ఏర్పాట్లు చూస్తూనే మరోవైపు 150వ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. టైం చాలా తక్కువగా ఉంది. ఈ సమ్మర్ లోనే కత్తి రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఓ వైపు కసరత్తులు చేసి పర్ ఫెక్ట్ ఫిజిక్ తెచ్చుకోవాలి. మరోవైపు ఫుల్ ప్రాక్టీస్ చేసి డాన్సింగ్ పై పట్టుసాధించాలి. వీటన్నింటికీ సమయం సరిపోదు. అందుకే చిరంజీవి ఇప్పుడు ఓ కొత్త ప్లాన్ వేశాడు. అదే జుంబా ప్రాక్టీస్. డాన్స్ ని కసరత్తులతో మిక్స్ చేస్తే అదే జుంబా స్టయిల్. ప్రస్తుతం చిరంజీవి ఇదే పనిలో ఉన్నారు. డాన్స్ ఫ్లోర్ పై ఫుల్లుగా జుంబా ఆడేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల ఎక్సర్ సైజు పూర్తవ్వడంతో పాటు డాన్స్ ప్రాక్టీస్ కూడా ఒకేసారి అయిపోతోంది. చిరు కొత్త ఐడియాకి మెగాఫ్యాన్స్ పొంగిపోతున్నారు. అంతా బాగానే ఉంది కానీ తన 150వ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రం చిరంజీవి చెప్పడం లేదు. బహుశా… శ్రీజ పెళ్లి తర్వాత బయటపెడతాడేమో…
First Published:  3 March 2016 6:19 AM GMT
Next Story