Telugu Global
Cinema & Entertainment

బాలయ్య కోసం కలల చిత్రాన్ని వదిలేశాడు

బాలయ్య సినిమా ఛాన్స్ అంటే ఏ దర్శకుడూ వదులుకోడు. సినిమా హిట్టయితే ఆ దర్శకుడి సుడి తిరిగినట్టే. పైగా మాస్ అప్పీల్ ఉన్న హీరో కావడంతో… దర్శకుడి పని కూడా చాలా సులువు అయిపోతుంది. అందుకే బాలయ్య సినిమా కోసం తను ఎన్నాళ్ల నుంచో కష్టపడి రాసుకున్న రుద్రాక్ష సినిమాను కూడా పక్కనపెట్టేశాడు కృష్ణవంశీ. తన వందో సినిమాను కృష్ణవంశీ చేతిలో పెట్టే ఆలోచనలో ఉన్నాడు బాలయ్య. ఇప్పటికే ముగ్గురు దర్శకుల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ… కృష్ణవంశీ […]

బాలయ్య కోసం కలల చిత్రాన్ని వదిలేశాడు
X
బాలయ్య సినిమా ఛాన్స్ అంటే ఏ దర్శకుడూ వదులుకోడు. సినిమా హిట్టయితే ఆ దర్శకుడి సుడి తిరిగినట్టే. పైగా మాస్ అప్పీల్ ఉన్న హీరో కావడంతో… దర్శకుడి పని కూడా చాలా సులువు అయిపోతుంది. అందుకే బాలయ్య సినిమా కోసం తను ఎన్నాళ్ల నుంచో కష్టపడి రాసుకున్న రుద్రాక్ష సినిమాను కూడా పక్కనపెట్టేశాడు కృష్ణవంశీ. తన వందో సినిమాను కృష్ణవంశీ చేతిలో పెట్టే ఆలోచనలో ఉన్నాడు బాలయ్య. ఇప్పటికే ముగ్గురు దర్శకుల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ… కృష్ణవంశీ చెప్పిన రైతు స్టోరీ లైన్ నచ్చడంతో అతడితోనే సెట్స్ పైకి వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నాడట. దీంతో రుద్రాక్ష సినిమాను కొన్నాళ్ల పాటు కృష్ణవంశీ పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. రుద్రాక్ష సినిమా కోసం మొదట అనుష్కను అనుకున్నారు. ఆ తర్వాత సమంతను తీసుకున్నారు. ఓ కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను కూడా సెలక్ట్ చేశారు. ప్రీ-ప్రొడక్షన్ అంతా అయిందనుకునేలోపే…. బాలయ్య సినిమా ఆఫర్ రావడంతో… రుద్రాక్షను మధ్యలోనే వదిలేశాడు కృష్ణవంశీ.
First Published:  2 March 2016 11:31 PM GMT
Next Story