Telugu Global
NEWS

దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నారా?

రాజధాని దురాక్రమణ అంటూ సాక్షి రాసిన కథనాలకు,  ఆపరేషన్ ఆకర్ష్‌కు లింక్‌ పెడుతూ టీడీపీ నేతలు కొత్త రకం చర్చ చేస్తున్నారు.  అధికారం, ఆర్థిక బలం ఉంది కదా అని..  వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవడం వల్లే కొత్తకొత్త ఇబ్బందులు వస్తున్నాయని వాపోతున్నారు. అవసరం లేకున్నా, ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేకున్నా కేవలం వైసీపీని మానసికంగా చిత్రహింసలు పెట్టాలన్న ఉద్దేశంతో ఆపరేషన్ ఆకర్ష్‌ మొదలుపెట్టడడం వల్లే  వైసీపీ నుంచి, సాక్షి నుంచి ఎదురుదాడి మొదలైందని విశ్లేషిస్తున్నారు. […]

దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నారా?
X

రాజధాని దురాక్రమణ అంటూ సాక్షి రాసిన కథనాలకు, ఆపరేషన్ ఆకర్ష్‌కు లింక్‌ పెడుతూ టీడీపీ నేతలు కొత్త రకం చర్చ చేస్తున్నారు. అధికారం, ఆర్థిక బలం ఉంది కదా అని.. వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవడం వల్లే కొత్తకొత్త ఇబ్బందులు వస్తున్నాయని వాపోతున్నారు. అవసరం లేకున్నా, ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేకున్నా కేవలం వైసీపీని మానసికంగా చిత్రహింసలు పెట్టాలన్న ఉద్దేశంతో ఆపరేషన్ ఆకర్ష్‌ మొదలుపెట్టడడం వల్లే వైసీపీ నుంచి, సాక్షి నుంచి ఎదురుదాడి మొదలైందని విశ్లేషిస్తున్నారు. రాజధాని దురాక్రమణ పేరుతో టీడీపీ నేతల పరువు బుగ్గిపాలవడానికి పరోక్షంగా టీడీపీ నాయకత్వమే కారణమని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

అమరావతిలో భారీగా కుంభకోణాలు జరుగుతున్నాయని మొదటి నుంచి ఆరోపణలు వచ్చినా వైసీపీ చూసీచూడనట్టు వెళ్లింది. అమరావతిలో జరుగుతున్న అక్రమాలపై పోరాటం చేస్తే రాజధాని నిర్మాణానికి అడ్డుపడుతున్నారని ప్రచారం చేస్తారన్న భయంతో వైసీపీ నేతలు ఒక స్థాయి వరకు మాత్రమే అమరావతి అక్రమాలపై పోరాటం చేస్తూ వచ్చారు. కానీ అనుభవం లేని పిల్ల నాయకుల మాటలు విని ఆపరేషన్ ఆకర్ష్ను మొదలుపెట్టడం వల్లే అసలు సమస్య మొదలైందంటున్నారు.

అనైతికంగా ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న నేపథ్యంలోనే సాక్షి ద్వారా రాజధానిలో టీడీపీ బడాబాబులు చేస్తున్న భూ అరాచకాలపై వైసీపీ యుద్ధాన్ని ప్రకటించిందని భావిస్తున్నారు. ఫిరాయింపుల వల్ల వైసీపీ వీక్ అవడం ఏమో గానీ … సాక్షి కథనాల దెబ్బకు చరిత్రలో జరగని విధంగా అమరావతిలో కుంభకోణం జరిగిందన్న విషయం జనంలోకి వెళ్లిపోయిందని భావిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టకుండా ఎవరి పని వారు చేసుకుని ఉండి ఉంటే ఈరోజు టీడీపీ పరువు ఇలా బజారున పడేది కాదని వాపోతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా దారిన పోయే దరిద్రాన్ని నెత్తిమీదకు తెచ్చుకున్నట్టుగా ఉందని వాపోతున్నారు. అయినదానికీ కానిదానికీ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చి, జగన్ మీద బురద చల్లే ఎల్లోమీడియా కూడా రాజధాని భూముల విషయంలో నోరు మెదపకపోవడంతో సాక్షిలో రాసిందంతా నిజమేనని టీడీపీ నాయకులు కూడా అంటున్నారు.

Click on image to read:

chandrababu-1

chandrababu

payyavula-keshav

narayana-pattipati

roja

Minister-MLC-Narayana

jagan1

lokesh

ramoji-undavalli

MLC-Narayana

dulipala

ganta-chandrababu

mininster-Narayana

ap-capital

narayana

tdp-ysrcp

sakshi

cbn-satrucharla

tdp-bjp

ysrcp-mla's

jagan-adi-chandrababu

bireddy

First Published:  2 March 2016 11:00 PM GMT
Next Story