Telugu Global
NEWS

బాబు ఇల్లు ఖాళీ చేయకతప్పదా?

అమరావతి సమీపంలోని ఉండవల్లి  వద్ద కృష్ణానది కరకట్టపై నిర్మించిన నివాసంలో చంద్రబాబు ఉంటున్నారు. ఇప్పుడు ఈ ఇంటిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.  వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిల్ వేశారు. కరకట్ట నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా కట్టిన నివాసాలపై ఈ పిల్ దాఖలు చేశారు. పిల్‌లో పొందుపరిచిన అక్రమ కట్టడాల్లో సీఎం నివాసం కూడా ఉంది.  పిల్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు … నిర్మాణం అక్రమమా సక్రమమా అన్నదానిపై వారంలో నివేదిక ఇవ్వాలని  స్థానిక […]

బాబు ఇల్లు ఖాళీ చేయకతప్పదా?
X

అమరావతి సమీపంలోని ఉండవల్లి వద్ద కృష్ణానది కరకట్టపై నిర్మించిన నివాసంలో చంద్రబాబు ఉంటున్నారు. ఇప్పుడు ఈ ఇంటిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిల్ వేశారు. కరకట్ట నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా కట్టిన నివాసాలపై ఈ పిల్ దాఖలు చేశారు. పిల్‌లో పొందుపరిచిన అక్రమ కట్టడాల్లో సీఎం నివాసం కూడా ఉంది. పిల్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు … నిర్మాణం అక్రమమా సక్రమమా అన్నదానిపై వారంలో నివేదిక ఇవ్వాలని స్థానిక తహసీల్దార్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

రాష్ట్ర విభజన ఉద్యమం నడుస్తున్న సమయంలో అదే అదనుగా కొందరు బడాబాబులు కృష్ణా నది వరద కట్టపై భారీ భవంతులు కట్టేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ అక్రమకట్టడాలపై హడావుడి చేశారు. కూల్చేస్తామంటూ నోటీసులు ఇచ్చారు. కానీ అది జరగలేదు.

అక్రమ నిర్మాణాలపై వివాదం నడుస్తుండగానే ఉండవల్లి వద్ద కృష్ణానది వరద కట్టపై ఎకరం 25 సెంట్ల విస్తీర్ణంలో నిర్మించిన ఒక బంగ్లాను చంద్రబాబు స్వాధీనం చేసుకున్నారు. ఈ భవనాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎయిర్‌కోస్తా విమాన సంస్థ అధినేత లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించారు. అదే అక్రమ నిర్మాణాన్ని ప్రస్తుతం చంద్రబాబు అధికార నివాసంగా వాడుతున్నారు. అక్రమ కట్టడాన్ని సీఎం అధికారనివాసంగా మార్చుకోవడంపై పెద్దెత్తున విమర్శలు వచ్చాయి. అయినా బాబు లెక్కచేయలేదు.

వరదకట్టపై అక్రమనిర్మాణాల విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నదికి 200 మీటర్ల పరిధిలోనే వరదకట్టపై నిర్మాణాలు చేపట్టడంపై మండిపడింది. వెంటనే వాటిని కూల్చివేయాలని ఆదేశించింది. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు అమలు చేస్తే చంద్రబాబు అధికార నివాసాన్ని కూల్చివేయాల్సి ఉంటుంది. అందుకే ఏకంగా చట్టాన్నే మార్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. చంద్రబాబు నివాసానికి ఇబ్బంది లేకుండా మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అక్రమకట్టడాలపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తాను నిప్పునని చెప్పుకునే చంద్రబాబు అక్రమ కట్టడంలో ఎలా ఉన్నారని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. వెంటనే ఇంటిని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం 60 ఎకరాల్లో అక్రమ కట్టడాలు నిర్మించారని ఎమ్మెల్యే ఆరోపించారు. పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కరకట్ట నిర్మాణం అక్రమం అన్నది అందరూ చెబుతున్నదే. మరి దీనిపై హైకోర్టు ఎలా తీర్పునిస్తుందో చూడాలి.

Click on image to read:

ysrcp-mla's

jagan-adi-chandrababu

tdp-ysrcp

adhinarayana

bireddy

jc-diwakar-reddy

polavaram

tdp-leaders-tenali

kcr-grand-children

devid-raj

bhuma-akhila-priya

bhuma

jagan-akhilpriya

adhinarayana-reddy

roja-gali

jagan-jc-rahul

roja-anam

pawan

revanth

ysrcp

First Published:  29 Feb 2016 3:36 AM GMT
Next Story