Telugu Global
CRIME

నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన టెక్ మోస‌గాడు అరెస్టు!

ఐటి కంపెనీలో ఉద్యోగం ఇస్తానంటూ నిరుద్యోగుల నుండి డ‌బ్బు వ‌సూలు చేసి ప‌రార‌వుతున్న ఒక ఘ‌రా‌నా టెక్ మోస‌గాడిని చెన్నై పోలీసులు విజ‌య‌వాడ‌లో ప‌ట్టుకున్నారు. శివ‌కుమార్ (40) అనే ఈ వ్య‌క్తి , డ‌మ్మీ సాఫ్ట్‌వేర్ కంపెనీల‌ను ప్రారంభించి నిరుద్యోగుల‌నుండి 20 నుండి 30వేల వ‌ర‌కు డ‌బ్బు వ‌సూలు చేసి ప‌రార‌య్యేవాడు. 12 ఏళ్లుగా అత‌ను ఇదే త‌ర‌హాలో మోసాల‌కు పాల్ప‌డుతున్నాడు. మ‌ధుర‌వోయిల్‌లో ఎక్స్‌డివి, అల‌ప‌క్క‌మ్‌లో ఎన్ఎక్స్‌టి గోపి టెక్ అనే కంపెనీల‌ను ప్రారంభించిన శివ‌కుమార్, హెచ్ […]

నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన టెక్ మోస‌గాడు అరెస్టు!
X

ఐటి కంపెనీలో ఉద్యోగం ఇస్తానంటూ నిరుద్యోగుల నుండి డ‌బ్బు వ‌సూలు చేసి ప‌రార‌వుతున్న ఒక ఘ‌రా‌నా టెక్ మోస‌గాడిని చెన్నై పోలీసులు విజ‌య‌వాడ‌లో ప‌ట్టుకున్నారు. శివ‌కుమార్ (40) అనే ఈ వ్య‌క్తి , డ‌మ్మీ సాఫ్ట్‌వేర్ కంపెనీల‌ను ప్రారంభించి నిరుద్యోగుల‌నుండి 20 నుండి 30వేల వ‌ర‌కు డ‌బ్బు వ‌సూలు చేసి ప‌రార‌య్యేవాడు. 12 ఏళ్లుగా అత‌ను ఇదే త‌ర‌హాలో మోసాల‌కు పాల్ప‌డుతున్నాడు. మ‌ధుర‌వోయిల్‌లో ఎక్స్‌డివి, అల‌ప‌క్క‌మ్‌లో ఎన్ఎక్స్‌టి గోపి టెక్ అనే కంపెనీల‌ను ప్రారంభించిన శివ‌కుమార్, హెచ్ ఆర్ డిపార్ట్‌మెంట్‌ని నియ‌మించుకుని, వారికి భారీగా జీతాలిచ్చేవాడు. హెచ్ఆర్ ద్వారా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌ను తీసుకునేవాడు. అయితే ప్ర‌తి అభ్య‌ర్థి నుండి 20వేలు, 30వేలు నుండి ఒక ల‌క్ష వ‌ర‌కు డిపాజిట్ చేయించుకునేవాడు. ఆ త‌రువాత వారికి మొండిచేయి చూపేవాడు. ఎక్స్‌డివి కంపెనీ పేరుతో 300మంది ఇంజినీరింగ్ అభ్య‌ర్థుల నుండి 30వేలు, ఎన్ఎక్స్‌టి గోపి టెక్ కంపెనీ ద్వారా వెయ్యి మంది అభ్య‌ర్థుల నుండి 20 వేల నుండి ఒక ల‌క్ష‌వ‌ర‌కు వ‌సూలు చేశాడు.

ఇలా మోసం చేసి సంపాదించిన డ‌బ్బుతో అత‌ను విలాస‌వంత‌మైన జీవితం గ‌డిపేవాడు. ఎంతోమంది అమ్మాయిల‌ను సైతం ఉద్యోగాలు ఇస్తానంటూ మోసం చేశాడు. శివ‌కుమార్ ముంబ‌యి, బెంగ‌లూరుల్లోనూ త‌న కంపెనీ బ్రాంచ్‌ల‌ను తెరిచాడు. చెన్నై సిటీ సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అత‌నికోసం గాలిస్తూ చివ‌రికి విజ‌య‌వాడ‌లో ఆదివారం ప‌ట్టుకున్నారు. ముంబ‌యి, ఎపిల్లోనే కాక తురైప‌క్క‌మ్, మ‌ధురైల్లో కూడా శివ‌కుమార్‌పై కేసులు న‌మోద‌య్యాయి.

First Published:  28 Feb 2016 11:00 PM GMT
Next Story