Telugu Global
Cinema & Entertainment

నా ప్రైవేట్ లైఫ్ గురించి వారికేం పని ?

ఇండస్ట్రీలో గాసిప్ ల గోల ఎక్కువు. ఇదిగో తొక అంటే ..అదిగో పులి అనే బ్యాచ్ ఎప్పుడూ గ‌న్ ఎక్కుపెట్టుకుని రెడీగా వుంటారు. ఇక స్టార్ లీగ్ లోవున్న హీరోయిన్స్ గురించి అయితే.. ప్ర‌తిక్ష‌ణం వాళ్లు ఏంచేస్తున్నారు.. ఎక్క‌డ వున్నారు.. ఏం తింటున్నారు.. ఎవ‌రితో తిరుగుతున్నారు.. అని ఎప్పుడు వాళ్ల మీద ఒక గాసిప్ దొరుకుతుందా అనే ఆలోచ‌న‌తోనే వ‌ర్కవుట్ చేస్తుంటారు. ఇది కేవలం బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి మాత్ర‌మే కాదు.. తెలుగు, హింది, త‌మిళ్,క‌న్న‌డ‌, ఇంగ్లీషు ఎక్క‌డైనా ఈ […]

నా ప్రైవేట్ లైఫ్ గురించి వారికేం పని ?
X

ఇండస్ట్రీలో గాసిప్ ల గోల ఎక్కువు. ఇదిగో తొక అంటే ..అదిగో పులి అనే బ్యాచ్ ఎప్పుడూ గ‌న్ ఎక్కుపెట్టుకుని రెడీగా వుంటారు. ఇక స్టార్ లీగ్ లోవున్న హీరోయిన్స్ గురించి అయితే.. ప్ర‌తిక్ష‌ణం వాళ్లు ఏంచేస్తున్నారు.. ఎక్క‌డ వున్నారు.. ఏం తింటున్నారు.. ఎవ‌రితో తిరుగుతున్నారు.. అని ఎప్పుడు వాళ్ల మీద ఒక గాసిప్ దొరుకుతుందా అనే ఆలోచ‌న‌తోనే వ‌ర్కవుట్ చేస్తుంటారు. ఇది కేవలం బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి మాత్ర‌మే కాదు.. తెలుగు, హింది, త‌మిళ్,క‌న్న‌డ‌, ఇంగ్లీషు ఎక్క‌డైనా ఈ విష‌యంలో ఒక్క‌టే పంధా .

హీరోయిన్స్ ఎవరితో అయిన క‌ల‌సి తిరిగితే ఏదో ఉంద‌ని రాసేయ‌డం దారునం అంటోంది టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. వృతి రీత్యా చాలా మందితో క‌లిసి ప‌ని చేయాల్సి వుంటుంది. అంత మాత్రాన ఎవ‌రితో మాట్లాడ‌కుండా ఉండడం.. లేదంటే ఎవరితో క‌ల‌సి మాట్లాడకూడ‌దు అన‌డం క‌రెక్ట్ కాదంటోంది. ఎవ‌రైనా స‌మవ‌య‌స్కులైన ..అబ్బాయిల‌తో ..లేదా సినిమా చేస్తున్న‌హీరోతో క్లోజ్ గా ఉంటే గాసిప్ రాయుళ్లు ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఎఫైర్ అంట గ‌డుతుంటారు..అదే ..మా అమ్మ , నాన్న‌, అక్క , త‌మ్ముళ్లు.. ఫ్రెండ్స్ గురించి ఎందుకు ఆరా తీయ‌రు అంటూ చుర‌క‌లు అంటిస్తుంది.

మొత్తం మీద త‌మ ప్ర‌వైట్ లైఫ్ త‌మ‌కు ఉండాల‌నేది ప్రియాంక వాద‌నండి.! నిజ‌మే..గ్లామ‌ర్ ఫీల్డ్ క‌దా.. వాళ్లు తెర‌మీద చేసే దానికంటే.. తెర వెన‌క ఏం చేస్తారు అనే విష‌యాలే ఎక్కువ మందికి ఆస‌క్తి మ‌రి.!
First Published:  28 Feb 2016 2:30 AM GMT
Next Story