Telugu Global
Health & Life Style

విరిగిన మ‌న‌సుకి టాటూ అతుకులు!

ఈ ప్రేమ శాశ్వ‌తం అనే భ్ర‌మ‌లో వేయించుకున్న టాటూలు, క‌ర్మ‌కాలి ఆ ప్రేమ బ్రేక‌ప్ అయితే తీపి గుర్తులుగా కాక చేదు గాయాలుగా మిగులుతాయి. ఇలాంట‌పుడు పాత టాటూని క‌నిపించ‌కుండా చేయ‌డానికి ప‌లుర‌కాల ప‌ద్ధ‌తులు వాడుక‌లోకి వ‌చ్చాయి. అలాగే బ్రేక‌ప్‌ని భ‌రించే ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, శాంతినీ ఇచ్చే టాటూలూ ఉన్నాయి- ఒక ఐటి ప్రొఫెష‌న‌ల్ త‌న ప్రేయ‌సి పేరులోని అక్ష‌రాల‌ను చేతి మ‌ణిక‌ట్టుమీద వేయించుకున్నాడు. అయితే ఆమెతో బ్రేక‌ప్ అయిపోయింది. ఆ అక్ష‌రాలు కనిపించ‌కుండా చేయాలి. […]

విరిగిన మ‌న‌సుకి టాటూ అతుకులు!
X

ఈ ప్రేమ శాశ్వ‌తం అనే భ్ర‌మ‌లో వేయించుకున్న టాటూలు, క‌ర్మ‌కాలి ఆ ప్రేమ బ్రేక‌ప్ అయితే తీపి గుర్తులుగా కాక చేదు గాయాలుగా మిగులుతాయి. ఇలాంట‌పుడు పాత టాటూని క‌నిపించ‌కుండా చేయ‌డానికి ప‌లుర‌కాల ప‌ద్ధ‌తులు వాడుక‌లోకి వ‌చ్చాయి. అలాగే బ్రేక‌ప్‌ని భ‌రించే ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, శాంతినీ ఇచ్చే టాటూలూ ఉన్నాయి-

ఒక ఐటి ప్రొఫెష‌న‌ల్ త‌న ప్రేయ‌సి పేరులోని అక్ష‌రాల‌ను చేతి మ‌ణిక‌ట్టుమీద వేయించుకున్నాడు. అయితే ఆమెతో బ్రేక‌ప్ అయిపోయింది. ఆ అక్ష‌రాలు కనిపించ‌కుండా చేయాలి. అందుకోసం అత‌ను ఒక ఉపాయం ఆలోచించాడు. త‌న‌కు విమాన‌యాన రంగ‌మంటే ఇష్టం. దృష్టిలోపం కార‌ణంగా ఆ అవ‌కాశం ద‌క్క‌లేదు. ఇప్పుడు త‌న మాజీ ప్రేయ‌సి పేరులోని అక్ష‌రాల‌ను విమానం బొమ్మ‌లో క‌లిపేస్తూ టాటూ వేయించుకున్నాడు. అలాగే పూలు, చేప‌లు, డ్రాగాన్‌, ప‌క్షిఈక‌లు…ఇలా థిక్‌గా క‌నిపించే డిజైన్లతో బ్రేక‌ప్ అయిన‌వారి పేర్ల‌ను క‌వ‌ర్ చేయించుకుంటున్నారు చాలామంది.

కొంత‌మంది వేయించుకున్న టాటూ ఇంట్లో కనిపించ‌కూడ‌ద‌నుకుంటారు. అలాగే బ్రేక‌ప్ అయిన బంధం తిరిగి అతుక్కుంటుంద‌నే ఆశ ఉండ‌వ‌చ్చు. ఇలాంటి వారు శాశ్వ‌తంగా వేయించుకున్న టాటూ ని క‌వ‌ర్ చేస్తూ కొన్ని తాత్కాలిక డిజైన్లు వేయించుకునే అవ‌కాశం ఉంది. తాత్కాలిక రంగులతో ఆ అక్ష‌రాలు క‌నిపించ‌కుండా చేస్తున్నారు.

ఇవ‌న్నీఇలా ఉంటే బ్రేక‌ప్ కార‌ణంగా ముక్క‌లైన, గాయ‌ప‌డిన మ‌న‌సు కోలుకునేందుకు, ఆత్మ‌స్థ‌యిర్యాన్ని పెంచుకునేందుకు కూడా కొంత‌మంది టాటూలు వేయించుకుంటున్నారు. అంటే బ్రేక‌ప్ త‌రువాత వీరు కొత్త‌గా టాటూ వేయించుకుంటారు. హోప్‌, ఫెయిత్‌, బిలీవ్‌, ప్రీ లాంటి ప‌దాల‌ను టాటూ వేయించుకుని త‌మ‌ను తాము ఊర‌డించుకుంటున్నారు. ఒక ర‌కంగా ఇవి ఒక స్థిర సంక‌ల్పం కోసం వేసుకునేవి. ఇవి పెయిన్ కిల్ల‌ ర్లుగా, ఇగో బూస్ట‌ర్లుగా పని చేస్తాయ‌ని టాటూ ఆర్టిస్టులు చెబుతున్నారు. ఏది ఏమైనా జీవితం లోని ప్ర‌తీ కోణాన్ని ప్ర‌పంచం ముందు ఉంచాల‌నే ప‌బ్లిసిటీ మేనియా త‌గ్గితే అస‌లు ఇలాంటి బాధ‌లు ప‌డాల్సిన అవ‌సరమే ఉండ‌దు.

First Published:  28 Feb 2016 9:29 AM GMT
Next Story