Telugu Global
NEWS

ఆదినారాయణరెడ్డికి రోషం, పౌరుషం వచ్చింది !

సిగ్గు, లజ్జ, దమ్ము, ధైర్యం ఉంటే వైసీపీ నుంచి తీసుకున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని జగన్‌ సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను సాక్షి టీవీలో పదేపదే ప్రసారం చేస్తూనే ఉన్నారు. ఆ మాటలు వింటే ఎవరికైనా పౌరుషం రావడం ఖాయం.  చంద్రబాబు నుంచి ఇంకా స్పందన రాకముందే జంపింగ్ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పందించారు. వైసీపీ సవాల్‌ చూసి ఆయనకు పౌరుషం వచ్చినట్టుంది. అందుకే  తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.  తన వ్యక్తిత్వం ముందు […]

ఆదినారాయణరెడ్డికి రోషం, పౌరుషం వచ్చింది !
X

సిగ్గు, లజ్జ, దమ్ము, ధైర్యం ఉంటే వైసీపీ నుంచి తీసుకున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని జగన్‌ సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను సాక్షి టీవీలో పదేపదే ప్రసారం చేస్తూనే ఉన్నారు. ఆ మాటలు వింటే ఎవరికైనా పౌరుషం రావడం ఖాయం. చంద్రబాబు నుంచి ఇంకా స్పందన రాకముందే జంపింగ్ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పందించారు.

వైసీపీ సవాల్‌ చూసి ఆయనకు పౌరుషం వచ్చినట్టుంది. అందుకే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన వ్యక్తిత్వం ముందు ఎమ్మెల్యే పదవి చాలా చిన్నదని చెప్పారు. పదవి గొప్పదనం నిలబడాలని తాను కూడా కోరుకుంటానన్నారు. అయితే రాజీనామాకు తాను సిద్ధమని పౌరుషంగా ప్రకటించిన ఆదినారాయణరెడ్డి అంతలోనే తెలివిగా నెపం చంద్రబాబుపై నెట్టేశారు.

పార్టీ మారినప్పుడే రాజీనామా చేస్తానని తాను చెప్పానని అయితే చంద్రబాబు మరోసారి చర్చిద్దామన్నారని వెల్లడించారు. చంద్రబాబు ఓకే అంటే అరగంటలో రాజీనామా చేస్తానన్నారు. వైసీపీ నచ్చలేదని టీడీపీలో చేరిన ఆదినారాయణరెడ్డి తన పదవికి రాజీనామా చేయడానికి చంద్రబాబు అనుమతి అవసరమా?. ఒకవేళ చంద్రబాబు రాజీనామా వద్దంటే … వైసీపీ నేతలు తిడుతున్నా ఎమ్మెల్యే పదవిలోనే ఆదినారాయణరెడ్డి కొనసాగుతారా?. నేతలు కదా ఏమైనా చేయగలరు?.

Click on image to read:

devid-raj

bhuma-akhila-priya

bhuma

jagan-akhilpriya

roja-gali

jagan-jc-rahul

316d158c-2a72-4e93-80b9-bbb41a88eb42

roja-anam

pawan

revanth

CM-KCR-Worry-About-His-Ging

cbn-doctorate

ysrcp

veni-krishna

balakrishna-speech

vote-for-note-1

First Published:  28 Feb 2016 8:40 AM GMT
Next Story