Telugu Global
Health & Life Style

ఈ మందులు… ఫుడ్‌తోనే వేసుకోవాలి!

అనారోగ్యానికి మందులు వాడుతున్న‌పుడు కొన్నింటిని ఆహారం తీసుకున్నాకే వేసుకోవాలని‌ డాక్ట‌ర్లు స‌ల‌హా ఇస్తుంటారు. అలాంటి మందుల‌ను క‌చ్ఛితంగా ఫుడ్ తీసుకున్నాక లేదా ఫుడ్‌తో పాటు వేసుకోవాలి. అలా చేయ‌క‌పోతే త‌ల తిర‌గ‌టం, క‌డుపులో స‌మ‌స్య‌లు రావ‌చ్చు. అలాగే కొన్ని ర‌కాల మందుల‌ను ఆహారంతో పాటు తీసుకుంటే అవి మ‌రింత‌గా ర‌క్తంలోకి చేర‌తాయి. అలాంటి మందుల్లో కొన్ని- త‌ల నొప్పులు, కీళ్ల‌నొప్పులు, రుతుక్ర‌మం స‌మ‌యంలో వ‌చ్చే నొప్పులు, జ్వ‌రం వీట‌న్నింటికీ వాడే… నాన్ స్టెరాయిడ‌ల్ యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ డ్ర‌గ్స్‌ని […]

ఈ మందులు… ఫుడ్‌తోనే వేసుకోవాలి!
X

అనారోగ్యానికి మందులు వాడుతున్న‌పుడు కొన్నింటిని ఆహారం తీసుకున్నాకే వేసుకోవాలని‌ డాక్ట‌ర్లు స‌ల‌హా ఇస్తుంటారు. అలాంటి మందుల‌ను క‌చ్ఛితంగా ఫుడ్ తీసుకున్నాక లేదా ఫుడ్‌తో పాటు వేసుకోవాలి. అలా చేయ‌క‌పోతే త‌ల తిర‌గ‌టం, క‌డుపులో స‌మ‌స్య‌లు రావ‌చ్చు. అలాగే కొన్ని ర‌కాల మందుల‌ను ఆహారంతో పాటు తీసుకుంటే అవి మ‌రింత‌గా ర‌క్తంలోకి చేర‌తాయి. అలాంటి మందుల్లో కొన్ని-

  • త‌ల నొప్పులు, కీళ్ల‌నొప్పులు, రుతుక్ర‌మం స‌మ‌యంలో వ‌చ్చే నొప్పులు, జ్వ‌రం వీట‌న్నింటికీ వాడే… నాన్ స్టెరాయిడ‌ల్ యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ డ్ర‌గ్స్‌ని ఆహ‌రంతో పాటే వేసుకుంటే మంచిది. నెప్రాక్సెన్‌, ఇబుప్రొఫెన్‌, యాస్ర్పిన్ లాంటివ‌న్నీ వీటికి సంబంధించిన‌వే. నాన్ స్టెరాయిడ‌ల్ యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ డ్ర‌గ్స్‌ని ఆహారంతో పాటు తీసుకుంటే అవి ప్రేవుల్లోని గ్యాస్ స‌మ‌స్య‌లకు, పొట్ట‌లో, ప్రేవుల్లో ర‌క్త‌స్రావాల‌కు మ‌రింత స‌మ‌ర్ధ‌వంతంగా ప‌నిచేస్తాయి.
  • అలాగే నార్కోటిక్ పెయిన్ రిలీవ‌ర్స్‌గా ప‌నిచేసే మందుల‌ను సైతం ఆహారంతోనే వేసుకోవాలి. ఇవి నొప్పుల‌ను కాకుండా, మెదడుకి శ‌రీరంనుండి అందే నొప్పి సంకేతాల‌ను త‌గ్గిస్తాయి. ఇలా ప‌నిచేసే మందుల‌ను సైతం ఆహారంతోనే వేసుకోవాలి.
  • టైప్ టు డ‌యాబెటిస్‌లో బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్లో లేని స‌మ‌యాల్లో వాడే మెట్‌ఫార్‌మిన్‌ని కూడా ఆహారంతోనే తీసుకోవాలి. అప్పుడే పొట్ట‌లో స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ఉంటాయి. ఆహారంతో పాటే డ‌యాబెటిస్ మందులు తీసుకోవ‌డం వ‌ల‌న షుగ‌ర్ లెవ‌ల్స్ ప‌డిపోకుండా కూడా ఉంటాయి
  • యాంటీ బ‌యోటిక్ మందుల‌ను వేసుకునేట‌పుడు ఆహారంతో వేసుకోవాలా వ‌ద్దా లాంటి వివ‌రాల‌ను త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకేర‌క‌మైన స‌ల‌హాలు ఈ మందుల‌న్నింటికీ ప‌నిచేయ‌వు. వీటి ప‌నితీరులో తేడాలు ఉంటాయి క‌నుక ఆహారం విష‌యంలో వైద్యుల స‌ల‌హా త‌ప్ప‌కుండా తీసుకోవాలి.
  • నోటిద్వారా వేసుకునే కుటుంబ నియంత్ర‌ణ మందుల‌ను సైతం ఆహారంతోనే వేసుకోవాలి. రోజూ ఒకే స‌మయంలో వాడాల్సిన ఈ మందుల‌ను ఆహారంతో వేసుకుంటే త‌ల తిర‌గ‌టం లాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. అలాగే ఆహారంతో పాటు అయితే వీటిని మ‌ర్చిపోకుండా వేసుకునే వీలుంటుంది.
  • గుండెల్లో మంట‌, అజీర్తి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే యాంటాసిడ్స్‌ని కూడా ఆహారంతోనే వేసుకోవాలి. వీటిని సాధార‌ణంగా మందుల‌షాపుల్లో తెచ్చి వాడుతుంటాం. క‌నీసం ఫుడ్ తీసుకున్న గంట త‌రువాత లేదా తింటున్న స‌మయంలోనే వీటిని వేసుకోవాలి. అయితే రాత్రులు అజీర్తి స‌మ‌స్య‌లు త‌లెత్తితే మాత్రం ఆహారం లేకుండానే వేసుకోవ‌చ్చు.
First Published:  26 Feb 2016 10:41 AM GMT
Next Story