Telugu Global
Cinema & Entertainment

రాజమౌళి సలహాతోనే ఏ నిర్ణయమైనా...

బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో అంతా చూశాం. కేవలం రాజమౌళి వల్లనే ఇదంతా సాధ్యమైందనే విషయం కూడా ప్రభాస్ కు తెలుసు. అందుకే కెరీర్ కు సంబంధించి ఇప్పుడు ఏ నిర్ణయమైనా రాజమౌళిని సంప్రదించిన తర్వాతే తీసుకుంటున్నాడు. బాహుబలి-2 తర్వాత ప్రభాస్ మళ్లీ తన పాత స్టయిల్ లోకి వచ్చేస్తున్నాడు. మాస్ మసాలా సినిమాలు చేయడానికి సిద్ధమౌతున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇంతలో […]

రాజమౌళి సలహాతోనే ఏ నిర్ణయమైనా...
X
బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో అంతా చూశాం. కేవలం రాజమౌళి వల్లనే ఇదంతా సాధ్యమైందనే విషయం కూడా ప్రభాస్ కు తెలుసు. అందుకే కెరీర్ కు సంబంధించి ఇప్పుడు ఏ నిర్ణయమైనా రాజమౌళిని సంప్రదించిన తర్వాతే తీసుకుంటున్నాడు. బాహుబలి-2 తర్వాత ప్రభాస్ మళ్లీ తన పాత స్టయిల్ లోకి వచ్చేస్తున్నాడు. మాస్ మసాలా సినిమాలు చేయడానికి సిద్ధమౌతున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇంతలో దర్శకుడు గుణశేఖర్… ప్రభాస్ ను సంప్రదించినట్టు చెబుతున్నారు. తను తీయబోతున్న ప్రతాపరుద్రుడు సినిమా కథను ప్రభాస్ కు వినిపించాడట గుణ. అయితే ఈ విషయంలో రాజమౌళి సలహా ప్రకారమే నడుచుకోవాలని భావిస్తున్నాడట ప్రభాస్. ఇప్పటికే రాజుల పాత్రలతో తీసిన బాహుబలి సినిమా ఉండగా… మళ్లీ మరో రాజు క్యారెక్టర్ చేస్తే ప్రజలు అనుమతిస్తారా… బోర్ ఫీలవుతారా అనే సందిగ్దంలో పడిపోయాడు ప్రభాస్. గుణ ఆఫర్ పై రాజమౌళి ఎలా చెబితే అలా నడుచుకోవాలని ప్రస్తుతానికి ఫిక్స్ అయ్యాడు.
First Published:  25 Feb 2016 8:24 PM GMT
Next Story