Telugu Global
Cinema & Entertainment

గ్యాంగ్ లీడర్ కాదు... కానీ చిరంజీవి టైటిలే....

ప్రస్తుతం రెండు సినిమాలు ఒకేసారి కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్న సాయిధర్మతేజ… తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్ టైనర్ చేసేందుకు సై అంటున్నాడు. ఈ సినిమాకు గ్యాంగ్ లీడర్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు రెండు రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని సాయిధర్మతేజ స్పష్టంచేశాడు. గోపీచంద్ తో తీయబోతున్న సినిమాకు గ్యాంగ్ లీడర్ అనే పేరు పెట్టడం లేదని స్పష్టంచేశాడు. అయితే […]

గ్యాంగ్ లీడర్ కాదు... కానీ చిరంజీవి టైటిలే....
X
ప్రస్తుతం రెండు సినిమాలు ఒకేసారి కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్న సాయిధర్మతేజ… తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్ టైనర్ చేసేందుకు సై అంటున్నాడు. ఈ సినిమాకు గ్యాంగ్ లీడర్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు రెండు రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని సాయిధర్మతేజ స్పష్టంచేశాడు. గోపీచంద్ తో తీయబోతున్న సినిమాకు గ్యాంగ్ లీడర్ అనే పేరు పెట్టడం లేదని స్పష్టంచేశాడు. అయితే చిరంజీవి నటించిన హిట్ సినిమాల్లో ఒక టైటిల్ ను మాత్రం కచ్చితంగా పెడతామని అంటున్నాడు.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మాతలుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం సుప్రీమ్, తిక్క అనే రెండు సినిమాలు చేస్తున్నాడు సాయిధర్మతేజ. ఈ రెండూ ఓ కొలిక్కి రాగానే…. గోపీచంద్ మలినేని ప్రాజెక్టు స్టార్టవుతుంది. సినిమా సెట్స్ పైకి వచ్చిన తర్వాతే టైటిల్ ప్రకటించే ఉద్దేశంతో టీం ఉంది.
First Published:  25 Feb 2016 3:14 AM GMT
Next Story