Telugu Global
Cinema & Entertainment

ప్రతాప రుద్రుడు ఇంకా బతికే ఉన్నాడు...

రుద్రమదేవి సినిమా విజయం తర్వాత… దానికి సీక్వెల్ గా ప్రతాపరుద్రుడు మూవీని తెరకెక్కిస్తానని దర్శకుడు గుణశేఖర్  ప్రకటించాడు. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడానికి దిల్ రాజు కూడా సిద్ధమయ్యాడు. కాకపోతే ఇప్పుడా ప్రాజెక్టు నుంచి దిల్ రాజు తప్పుకున్నట్టు తెలుస్తోంది. సో… ప్రతాపరుద్రుడు సినిమాను తన సొంత బ్యానర్ లోనే నిర్మిస్తూ తెరకెక్కించాలా… లేక ప్రాజెక్టును పక్కన పెట్టాలా అనే ఆలోచనలో గుణ ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఎట్టకేలకు ఈ పుకార్లకు చెక్ పెట్టాడు గుణశేఖర్. కాకతీయుల కాలానికి […]

ప్రతాప రుద్రుడు ఇంకా బతికే ఉన్నాడు...
X
రుద్రమదేవి సినిమా విజయం తర్వాత… దానికి సీక్వెల్ గా ప్రతాపరుద్రుడు మూవీని తెరకెక్కిస్తానని దర్శకుడు గుణశేఖర్ ప్రకటించాడు. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడానికి దిల్ రాజు కూడా సిద్ధమయ్యాడు. కాకపోతే ఇప్పుడా ప్రాజెక్టు నుంచి దిల్ రాజు తప్పుకున్నట్టు తెలుస్తోంది. సో… ప్రతాపరుద్రుడు సినిమాను తన సొంత బ్యానర్ లోనే నిర్మిస్తూ తెరకెక్కించాలా… లేక ప్రాజెక్టును పక్కన పెట్టాలా అనే ఆలోచనలో గుణ ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఎట్టకేలకు ఈ పుకార్లకు చెక్ పెట్టాడు గుణశేఖర్.
కాకతీయుల కాలానికి చెందిన ప్రతాపరుద్రుడుకు సంబంధించి ఏమైనా ఆసక్తికర విషయాలుంటే చెప్పండంటూ గుణశేఖర్ ప్రకటన జారీ చేశాడు. ఓ మెయిల్ ఐడీ ఇస్తూ… ఎవరికి ఎలాంటి ఆసక్తికర అంశాలు తెలిసినా మెయిల్ చేయాలని కోరుతున్నాడు. గుణశేఖర్ తాజా ప్రకటనతో… ప్రతాపరుద్రుడు ప్రాజెక్టు ఇంకా బతికే ఉందనే విషయం నిర్థారణ అయింది. అయితే ఆ సినిమాలో నటించే హీరో ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు. బాలయ్య, చిరంజీవి లాంటి పెద్ద స్టార్ల పేర్లు పరిశీలిస్తున్న గుణశేఖర్… ఎవరూ ఒప్పుకోకపోతే… రానాతోనే ప్రతాపరుద్రుడు సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమౌతాడని సమాచారం.
First Published:  25 Feb 2016 2:17 AM GMT
Next Story