Telugu Global
Cinema & Entertainment

రెహ‌మాన్ పై సూర్య కోపంగా ఉన్నాడా..?

స‌మ‌కాలిన భార‌త‌దేశ సినిమా సంగీత ద‌ర్శ‌కుల్లో దిగ్గజం అన ద‌గిన వ్య‌క్తి అంటే అది క‌చ్చితంగా ఎ ఆర్ రెహమాన్ అనే చెప్పాలి. పాశ్చ‌త్య ద‌ర్శ‌కుడు చేసిన స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ సినిమాకు సంగీతం అందించి.. రెండు అస్కార్ అవార్డులు అందుకున్నాడు. దీంతో ఆయ‌న ఖ్యాతి విశ్వ వ్యాప్తం అయ్యింది. క‌ట్ చేస్తే.. ప్ర‌స్తుతం రెహ‌మాన్ సంగీతం చేయించుకోవాలంటే.. భారీ బ‌డ్జెట్ చిత్రాలు అయితే త‌ప్ప‌.. చిన్న బ‌డ్జెట్ వాళ్ల‌కు అసాధ్యం. ఆయితే ఈ రెమ్యున రేష‌న్ ను […]

రెహ‌మాన్ పై సూర్య కోపంగా ఉన్నాడా..?
X

స‌మ‌కాలిన భార‌త‌దేశ సినిమా సంగీత ద‌ర్శ‌కుల్లో దిగ్గజం అన ద‌గిన వ్య‌క్తి అంటే అది క‌చ్చితంగా ఎ ఆర్ రెహమాన్ అనే చెప్పాలి. పాశ్చ‌త్య ద‌ర్శ‌కుడు చేసిన స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ సినిమాకు సంగీతం అందించి.. రెండు అస్కార్ అవార్డులు అందుకున్నాడు. దీంతో ఆయ‌న ఖ్యాతి విశ్వ వ్యాప్తం అయ్యింది. క‌ట్ చేస్తే.. ప్ర‌స్తుతం రెహ‌మాన్ సంగీతం చేయించుకోవాలంటే.. భారీ బ‌డ్జెట్ చిత్రాలు అయితే త‌ప్ప‌.. చిన్న బ‌డ్జెట్ వాళ్ల‌కు అసాధ్యం. ఆయితే ఈ రెమ్యున రేష‌న్ ను భరించ‌డం చిన్న బ‌డ్జెట్ వాళ్ల‌కు సాధ్య‌ప‌డదు.

ఇక ప్ర‌స్తుతం ఈ లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సూర్య న‌టిస్తున్న 24 అనే చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మ‌నం చిత్రం ఫేమ్ ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ చేస్తున్న ఈ చిత్రం టీజ‌ర్ ను ఈ వారంలో రిలీజ్ చేద్దామ‌ని ద‌ర్శ‌కుడు ప్లాన్ చేశాడ‌ట‌. అయితే రెహ‌మాన్ మాత్రం త‌న‌కు మ‌రింత స‌మ‌యం కావాల‌ని చెప్ప‌డంతో.. ఈ వారంలో సూర్య న‌టించిన 24 చిత్రం టీజ‌ర్ రిలీజ్ చేయ‌లేక పోతున్నార‌ట‌. దీంతో అటు సూర్య అభిమానులు.. ఇటు ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ కూడా ఒకింత అస‌హానంగా ఉన్నార‌ట‌. మ‌రి లేట్ అయినా.. లేటెస్ట్ అన్న‌ట్లుగా రెహమాన్ అవుట్ పుట్ ఇస్తారేమో చూడాలి.

First Published:  23 Feb 2016 7:30 PM GMT
Next Story