Telugu Global
Health & Life Style

మార్కులు తెచ్చే చాక్‌లెట్స్‌!

సాధార‌ణంగా చిన్న‌ పిల్ల‌ల‌కు ప‌రీక్ష‌ల్లో మంచి మార్కులు వ‌స్తే చాక్‌లెట్స్ కొనిస్తామ‌ని త‌ల్లిదండ్రులు చెబుతుంటారు…కానీ చాక్‌లెట్స్ వారికి ముందే కొనిపెడితే మ‌రింత బాగా మార్కులు వ‌స్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. హాట్ చాక్‌లెట్ డ్రింకు తీసుకున్నాక కొంత‌మంది వ‌లంటీర్లు లెక్కలు బాగా చేసిన‌ట్టుగా పరిశోధ‌కులు గుర్తించారు. చాక్‌లెట్స్ మాన‌సిక అల‌స‌ట‌ని త‌గ్గిస్తాయ‌ని, బుర్ర త్వ‌ర‌గా వేడెక్క‌కుండా చూస్తాయ‌ని వీరు చెబుతున్నారు. బ్రిటీష్ సైక‌లాజిక‌ల్ సొసైటీ ఈ వివ‌రాలు ప్ర‌క‌టించింది. మెద‌డు సామ‌ర్ధ్యాన్ని నిరూపించుకోవాల్సిన ప‌నుల్లో చాక్‌లెట్స్ అద్భుతంగా ప‌నిచేస్తాయ‌ని […]

మార్కులు తెచ్చే చాక్‌లెట్స్‌!
X

సాధార‌ణంగా చిన్న‌ పిల్ల‌ల‌కు ప‌రీక్ష‌ల్లో మంచి మార్కులు వ‌స్తే చాక్‌లెట్స్ కొనిస్తామ‌ని త‌ల్లిదండ్రులు చెబుతుంటారు…కానీ చాక్‌లెట్స్ వారికి ముందే కొనిపెడితే మ‌రింత బాగా మార్కులు వ‌స్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. హాట్ చాక్‌లెట్ డ్రింకు తీసుకున్నాక కొంత‌మంది వ‌లంటీర్లు లెక్కలు బాగా చేసిన‌ట్టుగా పరిశోధ‌కులు గుర్తించారు. చాక్‌లెట్స్ మాన‌సిక అల‌స‌ట‌ని త‌గ్గిస్తాయ‌ని, బుర్ర త్వ‌ర‌గా వేడెక్క‌కుండా చూస్తాయ‌ని వీరు చెబుతున్నారు. బ్రిటీష్ సైక‌లాజిక‌ల్ సొసైటీ ఈ వివ‌రాలు ప్ర‌క‌టించింది.

మెద‌డు సామ‌ర్ధ్యాన్ని నిరూపించుకోవాల్సిన ప‌నుల్లో చాక్‌లెట్స్ అద్భుతంగా ప‌నిచేస్తాయ‌ని ప‌రిశోధ‌కులు ఘంటాప‌థంగా చెబుతున్నారు. ప‌రీక్ష‌ల‌కోసం చ‌దువుతున్న పిల్ల‌ల‌కు చాక్‌లెట్స్ నిజంగా మేలుచేస్తాయ‌ని మెద‌డు, దాని సామ‌ర్ధ్యం, పోష‌కాల‌కు సంబంధించిన అంశాల‌పై యూనివ‌ర్శిటీ డైర‌క్ట‌ర్ స్థాయిలో ప‌నిచేస్తున్న ప్రొఫెస‌ర్ ఒక‌రు చెబుతున్నారు.

ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉన్నవారైనా ప్రతిరోజూ చాక్లెట్స్‌ని తింటూ ఉంటే మెదడు చురుకుదనం పెరుగుతుందని దక్షిణ ఆస్ట్రేలియా యూనివర్శిటీ పరిశోధకులు వెల్ల‌డించారు. చాక్‌లెట్స్‌ని తరచుగా తినేవారిలో మెదడుకి సంబంధించిన వివిధ సామర్థ్యాలు గణనీయంగా పెరిగినట్టుగా వీరు గుర్తించారు. చాక్‌లెట్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వలన వయసు మీరటం కారణంగా ఎదురయ్యే మతిమరుపు, మెదడు శ‌క్తి సామ‌ర్ధ్యాలు తగ్గటం లాంటి సమస్యలు ఉండవని వారు సూచిస్తున్నారు.

బ్రెయిన్ ఫుడ్‌లో డార్క్ చాక్‌లెట్స్ ముందువ‌రుస‌లో ఉంటాయ‌ని ఇంత‌కుముందే పరిశోధ‌న‌ల్లో రుజువైంది. డార్క్ చాకెలెట్స్ తిన‌డం వ‌ల‌న మెద‌డులో ఫీల్‌గుడ్ హార్మోన్లు ఎండార్ఫిన్లు ఎక్కువ‌గా విడుద‌ల అవుతాయి. డార్క్ చాక్‌లెట్స్‌లో ఉన్న ఫ్లేవ‌నాయిడ్స్ పెద్ద‌వారిలో అయినా, చిన్న‌పిల్ల‌ల్లో అయినా మెద‌డులో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను పెంచుతాయి. ప్ర‌తిరోజూ త‌గిన మోతాదులో వీటిని తీసుకుంటే మెద‌డు శ‌క్తి, ఆలోచ‌నావిధానం, మూడ్ ఇవ‌న్నీ మెరుగ‌వుతాయి.

హార్వ‌ర్డ్ మెడిక‌ల్ స్కూల్ చేసిన అధ్య‌య‌నంలో రెండుక‌ప్పుల హాట్ చాక్లెట్‌ని తాగ‌టం వ‌ల‌న మెద‌డులో 2నుండి3 గంట‌ల‌పాటు ర‌క్త ప్ర‌స‌ర‌ణ పెరుగుతుంద‌ని తేలింది. ఈ వేగం మ‌న ప‌నితీరుపై ప్ర‌భావం చూపుతుంది. మ‌రింత స‌మ‌ర్ధ‌వంతంగా ప‌నిచేయగ‌లుగుతాం. వ‌ర్కింగ్ మెమొరీ పెరుగుతుంది.

చాక్‌లెట్ల‌ని ఇంతకుముందు రోజుల్లో జ్వరాలను తగ్గించడానికి, పిల్లలకు విరేచినాల సమయంలో, మహిళలకు సంబంధించిన సమస్యలకు, తల్లిపాల ఉత్పత్తికి, చక్కని నిద్రకు, పళ్ల శుభ్రతకు వినియోగించినట్టుగా ఈ పరిశోధకులు గుర్తు చేస్తున్నారు.

అయితే చాక్‌లెట్స్‌ని తినేట‌ప్పుడు ఇత‌ర ఆరోగ్య ప‌రిస్థితుల‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందే. ఎలాంటి చాక్‌లెట్స్‌ని తీసుకుంటున్నారు, ఎంత మోతాదులో తీసుకుంటున్నారు…అనే అంశాలను మ‌ర్చిపోకూడ‌దు.

First Published:  24 Feb 2016 3:06 AM GMT
Next Story