Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ పెంచలేదు... వాళ్లే ఇచ్చేస్తున్నారు...

పారితోషికం మనం పెంచకూడదు. నిర్మాతలు ఇష్టంగా ఇవ్వాలి. ఈమధ్య తన పుట్టినరోజు సందర్భంగా బ్రహ్మానందం చెప్పిన మాటిది. నిజమే…. హీరోలంతా ఒక హిట్ వచ్చిన వెంటనే రేటు పెంచేస్తున్నారు. నిర్మాతల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. కానీ ప్రభాస్ విషయంలో మాత్రం అలా జరగలేదు. బాహుబలి సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఈ సినిమా విజయానికి బ్రహ్మాండమనే మాట కూడా చిన్నదే అంటారు విశ్లేషకులు. ఎందుకంటే… ఏకంగా 650 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి బాహుబలికి. […]

ప్రభాస్ పెంచలేదు... వాళ్లే ఇచ్చేస్తున్నారు...
X
పారితోషికం మనం పెంచకూడదు. నిర్మాతలు ఇష్టంగా ఇవ్వాలి. ఈమధ్య తన పుట్టినరోజు సందర్భంగా బ్రహ్మానందం చెప్పిన మాటిది. నిజమే…. హీరోలంతా ఒక హిట్ వచ్చిన వెంటనే రేటు పెంచేస్తున్నారు. నిర్మాతల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. కానీ ప్రభాస్ విషయంలో మాత్రం అలా జరగలేదు. బాహుబలి సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఈ సినిమా విజయానికి బ్రహ్మాండమనే మాట కూడా చిన్నదే అంటారు విశ్లేషకులు. ఎందుకంటే… ఏకంగా 650 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి బాహుబలికి. మరి ఇంత అఖండ విజయం సాధించిన తర్వాత ప్రభాస్ రెమ్యునరేషన్ పెంచకుండా ఉంటాడా… కచ్చితంగా పెంచుతాడనే అంతా అనుకుంటారు.
ప్రభాస్ కు పారితోషికం పెరిగిన మాట వాస్తవమే. కానీ అది అతను పెంచలేదు. నిర్మాతలే ఎంతో ఇష్టంగా, ప్రేమతో ఇచ్చారు. నిజానికి బాహుబలి సినిమా రెండు భాగాలకు కలిపి 26 కోట్ల రూపాయలకు ప్రభాస్ తో డీల్ సెట్ అయింది. కానీ ప్రభాస్ అడక్కపోయినా… నిర్మాతలే ముందుకొచ్చి అతడికి 35 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు సమాచారం. అటు రానాకు కూడా పారితోషికం పెంచారట.
First Published:  24 Feb 2016 8:14 AM GMT
Next Story