Telugu Global
Cinema & Entertainment

ముంబయిలో బెజవాడ మార్కెట్ 

రామ్ గోపాల్ వర్మ సృష్టి ఇది. ఎన్ని బెదిరింపులు ఎదురైనప్పటికీ వంగవీటి కథను సినిమాగా తీయడానికే ఫిక్స్ అయ్యాడు రామ్ గోపాల్ వర్మ. ఆల్రెడీ సినిమా ప్రాసెస్ కూడా ప్రారంభించాడు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు… ముంబయిలోనే టోటల్ షూటింగ్ నిర్వహించాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా ముంబయిలో…. విజయవాడ కాళేశ్వర మార్కెట్ సెట్ వేశారు. వంగవీటి రంగ హత్య కు దారితీసిన కారణాల నుంచి… తదనంతరం జరిగిన పరిణామాలన్నింటినీ వెండితెరపై చూపించడానికి సిద్ధమౌతున్న వర్మ…. కుదిరితే రక్త […]

ముంబయిలో బెజవాడ మార్కెట్ 
X
రామ్ గోపాల్ వర్మ సృష్టి ఇది. ఎన్ని బెదిరింపులు ఎదురైనప్పటికీ వంగవీటి కథను సినిమాగా తీయడానికే ఫిక్స్ అయ్యాడు రామ్ గోపాల్ వర్మ. ఆల్రెడీ సినిమా ప్రాసెస్ కూడా ప్రారంభించాడు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు… ముంబయిలోనే టోటల్ షూటింగ్ నిర్వహించాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా ముంబయిలో…. విజయవాడ కాళేశ్వర మార్కెట్ సెట్ వేశారు. వంగవీటి రంగ హత్య కు దారితీసిన కారణాల నుంచి… తదనంతరం జరిగిన పరిణామాలన్నింటినీ వెండితెరపై చూపించడానికి సిద్ధమౌతున్న వర్మ…. కుదిరితే రక్త చరిత్ర తరహాలో…వంగవీటి కథను కూడా పార్ట్-1, పార్ట్-2గా విడుదల చేయాలనుకుంటున్నాడు.
ఈ సినిమాకు పనిచేసే నటీనటుల వివరాల్ని కూడా అత్యంత గోప్యంగా ఉంచుతున్న వర్మ…. మొత్తం సినిమాను నెల రోజుల్లో పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే కావాల్సినంత సమాచారం సేకరించిన ఈ దర్శకుడు…. కుదిరితే కథలో మరిన్ని క్యారెక్టర్లు చొప్పించి… ఫ్యాక్షన్ కథకు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాడు.
First Published:  22 Feb 2016 3:34 AM GMT
Next Story