Telugu Global
Cinema & Entertainment

మహేష్ సరసన శైలజ సెట్ అయినట్టే....!

ప్రస్తుతం బ్రహ్మోత్సంవ సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు…. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే… మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేసేందుకు సిద్ధమౌతున్నాడు. ఏప్రిల్ 14నుంచి సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయింది. అయితే హీరోయిన్ గా ఎవర్ని తీసుకుందామనే విషయం వద్ద మాత్రం ఆగిపోయింది. బాలీవుడ్ బ్యూటీస్ లో కొందరి పేర్లు ప్రయత్నించినప్పటికీ…. రకరకాల సమీకరణాల వల్ల ఎవరికీ ఫిక్స్ కాలేకపోయారు. ఇటు […]

మహేష్ సరసన శైలజ సెట్ అయినట్టే....!
X
ప్రస్తుతం బ్రహ్మోత్సంవ సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు…. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే… మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేసేందుకు సిద్ధమౌతున్నాడు. ఏప్రిల్ 14నుంచి సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయింది. అయితే హీరోయిన్ గా ఎవర్ని తీసుకుందామనే విషయం వద్ద మాత్రం ఆగిపోయింది. బాలీవుడ్ బ్యూటీస్ లో కొందరి పేర్లు ప్రయత్నించినప్పటికీ…. రకరకాల సమీకరణాల వల్ల ఎవరికీ ఫిక్స్ కాలేకపోయారు. ఇటు తెలుగులో కూడా సమంత, కాజల్ లాంటి పేర్లు పరిశీలించినప్పటికీ…. ఫ్రెష్ లుక్ ఉండదనే ఉద్దేశంతో పక్కనపెట్టారు. ఫైనల్ గా…. మహేష్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం కీర్తి సురేష్ కు దక్కినట్టు తెలుస్తోంది. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ భామ… మహేష్ సరసన నటించడానికి సిద్ధమౌతున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ స్టేట్ మెంట్ రాబోతోంది. రెమ్యునరేషన్ తక్కువగా ఉండడం… కాల్షీట్లు ఎక్కువగా కేటాయించడమే… కీర్తి సురేష్ ఎంపికకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
First Published:  21 Feb 2016 11:30 PM GMT
Next Story