Telugu Global
Cinema & Entertainment

ఆ హీరోకు స‌మంత నో చెప్పింది..!

అందాల ముద్దుగుమ్మ స‌మంత స్టార్ హీరోల‌తో మాత్ర‌మే చిత్రాలు చేస్తుందా..? అంటే నిజ‌మే అనుకోవాలి అంటున్నారు కోలీవుడ్ జ‌నాలు. విష‌యం ఏమిటంటే.. కోలీవుడ్ లో ఈ మ‌ధ్య స‌మంత ఓ సినిమా వదులుకుందని.. దీనికి కారణం హీరో నచ్చకపోవటేమని అక్కడ ఆమె పై ఒక రూమ‌ర్ వ‌చ్చింది. అయితే మొదట దర్శకుడు విజయ్ మిల్టన్ చెప్పిన కధ నచ్చి సినిమాకి ఒకే చెప్పిందని తీరా హీరో మాజీ హీరోయిన్ దేవయాని భర్త రాజ్ కుమారన్ లీడ్ రోల్ […]

ఆ హీరోకు స‌మంత నో చెప్పింది..!
X

అందాల ముద్దుగుమ్మ స‌మంత స్టార్ హీరోల‌తో మాత్ర‌మే చిత్రాలు చేస్తుందా..? అంటే నిజ‌మే అనుకోవాలి అంటున్నారు కోలీవుడ్ జ‌నాలు. విష‌యం ఏమిటంటే.. కోలీవుడ్ లో ఈ మ‌ధ్య స‌మంత ఓ సినిమా వదులుకుందని.. దీనికి కారణం హీరో నచ్చకపోవటేమని అక్కడ ఆమె పై ఒక రూమ‌ర్ వ‌చ్చింది. అయితే మొదట దర్శకుడు విజయ్ మిల్టన్ చెప్పిన కధ నచ్చి సినిమాకి ఒకే చెప్పిందని తీరా హీరో మాజీ హీరోయిన్ దేవయాని భర్త రాజ్ కుమారన్ లీడ్ రోల్ చేయబోతున్నాడని చెప్పిన తరువాత సినిమాకి నో చెప్పింది అంటున్నారు. అయితే సమంతా మాత్రం అలాంటి ప్రాజెక్టు ఏమీ చెయ్యటం లేదని చెప్పింది. తన ప్రస్తుత దృష్టి మొత్తం మహేష్ తో చేస్తున్న బ్రహ్మోత్సవం పైనే ఉందని తేల్చి చెప్పింది.

అలాంటి రూమర్స్ నమ్మవద్దని తన అభిమానులనూ కోరింది. అయినా స్టార్ లీగ్ లో కొన సాగుతున్న హీరోయిన్.. ఫ్లాప్ లో ఉన్న హీరోతో ఎలా చేస్తుందని ఆమె అభిమానులు వాదిస్తున్నారు. సినిమా అంటే అంత బిజినెస్ క‌దా..? ఎవ‌రో కమెడియ‌న్ తో స‌మంత లాంటి అందాల ముద్దుగుమ్మ న‌టిస్తే.. ఇక ఆమే కెరీర్ ఏమి కావాలి.. అని వారు ప్రశ్నిస్తున్నారు.. అందుకే స‌మంత తెలివిగా నో చెప్పి వుంటుంది అనుకుంటున్నారు ఆమే ఫ్యాన్స్.

First Published:  17 Feb 2016 9:45 AM GMT
Next Story