Telugu Global
Cinema & Entertainment

యాంక‌ర్ అన‌సూయ‌...ఇక పోలీస్ అన‌సూయ‌!

ఒక్క‌సినిమాలో పోలీస్ పాత్ర‌లో న‌టీమ‌ణులు ఎవ‌రైనా క్లిక్ అయితే వ‌రుస‌పెట్టి అవే అవ‌కాశాలు వారికి రావ‌డం  చాలామంది విష‌యంలో చూశాం. యాంక‌ర్ అన‌సూయ విష‌యంలోనూ అదే జ‌రిగేలా ఉంది. క్ష‌ణం సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల అయ్యాక  పోలీస్ పాత్ర‌లు ఆమెను వెతుక్కుంటూ వ‌స్తున్నాయ‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కు వాలుక‌ళ్ల చూపులు, చిలిపిన‌వ్వుల‌ను బుల్లితెరమీద రువ్విన అన‌సూయ‌, ఈ సినిమాతో  పెద్ద‌తెర‌పై బుల్లెట్ల వ‌ర్షం కురిపిస్తానంటోంది.   క్ష‌ణం సినిమా,  త‌న‌కు ఇప్పుడు బుల్లితెర‌మీద ఉన్న ఇమేజ్‌కి పూర్తి వ్య‌తిరేకంగా ఉంటుంద‌ని  […]

యాంక‌ర్ అన‌సూయ‌...ఇక పోలీస్ అన‌సూయ‌!
X

ఒక్క‌సినిమాలో పోలీస్ పాత్ర‌లో న‌టీమ‌ణులు ఎవ‌రైనా క్లిక్ అయితే వ‌రుస‌పెట్టి అవే అవ‌కాశాలు వారికి రావ‌డం చాలామంది విష‌యంలో చూశాం. యాంక‌ర్ అన‌సూయ విష‌యంలోనూ అదే జ‌రిగేలా ఉంది. క్ష‌ణం సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల అయ్యాక పోలీస్ పాత్ర‌లు ఆమెను వెతుక్కుంటూ వ‌స్తున్నాయ‌ట‌.

ఇప్ప‌టివ‌ర‌కు వాలుక‌ళ్ల చూపులు, చిలిపిన‌వ్వుల‌ను బుల్లితెరమీద రువ్విన అన‌సూయ‌, ఈ సినిమాతో పెద్ద‌తెర‌పై బుల్లెట్ల వ‌ర్షం కురిపిస్తానంటోంది. క్ష‌ణం సినిమా, త‌న‌కు ఇప్పుడు బుల్లితెర‌మీద ఉన్న ఇమేజ్‌కి పూర్తి వ్య‌తిరేకంగా ఉంటుంద‌ని చెబుతోంది. ఇందులో ఆమె గ‌ట్స్ ఉన్న పోలీస్ అధికారిణిగా న‌టిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు మేక‌ప్ లేకుండా కెమెరా ముందుకు వెళ్ల‌ని తాను, ఇప్పుడు ఈ పాత్రకోసం మేక‌ప్ లేకుండా న‌టిస్తున్నానని అన‌సూయ తెలిపింది. త‌న బాడీ లాంగ్వేజ్‌లో కూడా అనేక మార్పులు చేశాన‌ని, గ‌న్‌ప‌ట్టుకోవ‌డం, చూపుల్లో తీక్ష‌ణ‌త…ఇలా ప్ర‌తి విష‌యంలోనూ శ్ర‌ద్ధ తీసుకున్నాన‌ని ఆమె చెబుతోంది. త‌న‌కు అనుక‌ర‌ణ బాగా వ‌చ్చ‌ని అందుకే పోలీసు పాత్ర‌లున్న సినిమాలను మ‌రీ ఎక్కువ‌గా చూడ‌లేద‌ని ఆమె చెప్పింది. తెర‌మీద మ‌రొక‌రిలాగా న‌టించ‌డం త‌న‌కు న‌చ్చ‌ద‌ని, త‌న పాత్రను త‌న త‌ర‌హాలో భిన్నంగా చేయాల‌ని ఆశిస్తున్న‌ట్టుగా తెలిపింది.

ఈ సినిమాతో ర‌వికాంత్ పేరెపు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. అడివి శేషు ప్ర‌ధాన‌పాత్ర ధ‌రిస్తున్నాడు. ఇందులో ఇంకా అదాశ‌ర్మ‌, వెన్నెల కిశోర్‌, స‌త్యం రాజేష్ ప్ర‌ధాన పాత్ర‌లు ధ‌రిస్తున్నారు. పివిపి సినిమా సంస్థ దీన్ని నిర్మిస్తోంది.

క్ష‌ణం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల త‌రువాత పోలీస్ పాత్ర‌లు చాలా వ‌స్తున్నా, ఒక్క‌దానికి మాత్రమే అంగీకారం తెలిపాన‌ని అన‌సూయ అంది. ఆ సినిమాని ఒక ప్ర‌ముఖ సంస్థ నిర్మిస్తోంద‌ని, అందులో క‌థ త‌న చుట్టూనే తిరుగుతుంద‌ని, ఆ సినిమాతో పాటు ఒక కామెడీ థ్రిల్ల‌ర్‌లోనూ న‌టించే అవ‌కాశం ఉంద‌ని ఆమె తెలిపింది.

First Published:  17 Feb 2016 6:24 AM GMT
Next Story