Telugu Global
Cinema & Entertainment

బ్రహ్మోత్సవం లేటవుతుందా...?

ఇప్పటికే బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ కాస్త ఆలస్యంగా నడుస్తోంది. అనుకున్న దానిప్రకారం ఒక 30శాతం వెనకబడే ఉంది. ఇప్పుడీ సినిమా మరింత ఆలస్యం అవుతుందేమోనని ఘట్టమనేని ఫ్యాన్స్ తెగ హైరానా పడుతున్నారు. వీళ్ల టెన్షన్ కు కారణం ప్రణీత. బ్రహ్మోత్సవంలో ముగ్గురు హీరోయిన్లలో ఒక భామగా నటిస్తున్న ప్రణీత… యాక్సిడెంట్ కు గురైంది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా…. ప్రణీత ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. దీంతో ఈ కన్నడ భామకు స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు ప్రణీతతో […]

బ్రహ్మోత్సవం లేటవుతుందా...?
X
ఇప్పటికే బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ కాస్త ఆలస్యంగా నడుస్తోంది. అనుకున్న దానిప్రకారం ఒక 30శాతం వెనకబడే ఉంది. ఇప్పుడీ సినిమా మరింత ఆలస్యం అవుతుందేమోనని ఘట్టమనేని ఫ్యాన్స్ తెగ హైరానా పడుతున్నారు. వీళ్ల టెన్షన్ కు కారణం ప్రణీత. బ్రహ్మోత్సవంలో ముగ్గురు హీరోయిన్లలో ఒక భామగా నటిస్తున్న ప్రణీత… యాక్సిడెంట్ కు గురైంది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా…. ప్రణీత ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. దీంతో ఈ కన్నడ భామకు స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు ప్రణీతతో తీయాల్సిన సన్నివేశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎక్కువమంది తారాగణం నటించే సన్నివేశాల్లో ప్రణీత కూడా కనిపించాల్సి ఉంది. అందరి కాల్షీట్లు అడ్జస్ట్ అయ్యాయని సంబరపడేలోగా… ప్రణీతకు యాక్సిడెంట్ అయింది. దీంతో ఏం చేయాలో పాలుపోక టీం అంతా తలపట్టుక్కూర్చుంది. ప్రణీత కోసం మహేష్ తో కలిపి దాదాపు 10 మంది బడా ఆర్టిస్టుల కాల్షీట్లు క్యాన్సిల్ చేయాలా అనే ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు ప్రణీత లేకుండా కొన్ని సీన్లు తీసేసే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. గతంలో సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా టైమ్ లో కూడా ఇలానే చేశాడు. సో… ప్రణీత గాయం… బ్రహ్మోత్సవం డిలేకు మరో కారణం కాబోతుందని అంతా అనుకుంటున్నారు.
Click on Image to Read:
varuntej
mahesh
kareena
First Published:  15 Feb 2016 8:58 PM GMT
Next Story