Telugu Global
NEWS

బాబు చార్జింగ్ గురించి తెలుసా?- రోజాపై సోమిరెడ్డి ఫైర్

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రోజాను హెచ్చరించారు. చంద్రబాబు ప్రజల కోసం పుట్టారని, జగన్ డబ్బు కోసం పుట్టారని సోమిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రెండంకెల అభివృద్ధి సాధించే సత్తా మాత్రమే చంద్రబాబుకు ఉందని జగన్‌ తరహాలో లక్ష కోట్లు సంపాదించే శక్తిసామర్థ్యాలు తమ నేతకు లేవన్నారు సోమిరెడ్డి. జగన్ ఒక యాపిల్ ఫోన్ అని రోజా అంటున్నారని.. కానీ యాపిల్ ఫోన్ కు […]

బాబు చార్జింగ్ గురించి తెలుసా?- రోజాపై  సోమిరెడ్డి ఫైర్
X

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రోజాను హెచ్చరించారు. చంద్రబాబు ప్రజల కోసం పుట్టారని, జగన్ డబ్బు కోసం పుట్టారని సోమిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రెండంకెల అభివృద్ధి సాధించే సత్తా మాత్రమే చంద్రబాబుకు ఉందని జగన్‌ తరహాలో లక్ష కోట్లు సంపాదించే శక్తిసామర్థ్యాలు తమ నేతకు లేవన్నారు సోమిరెడ్డి.

జగన్ ఒక యాపిల్ ఫోన్ అని రోజా అంటున్నారని.. కానీ యాపిల్ ఫోన్ కు మూడు నాలుగు గంటలకు మించి చార్జింగ్ ఉండదన్న విషయం రోజా గుర్తు పెట్టుకోవాలన్నారు. చంద్రబాబుకు 18 గంటలు చార్జింగ్ ఉంటుందని సోమిరెడ్డి చెప్పారు. చంద్రబాబు అస్తమించే సూర్యుడు కాదని… జగనే జైల్లో అస్తమించకుండా చూసుకోవాలన్నారు.

జగన్‌ చరిత్ర నాంపల్లి కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు తెలుసని ఎద్దేవా చేశారు. ఐఏఎస్‌లు, మాజీ మంత్రులను జైలుకు పంపిన ఘనత జగన్‌దేనని అన్నారు. చంద్రబాబు ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తారని, వచ్చే ఎన్నికల్లో 200 సీట్లను టీడీపీ సాధిస్తుందని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుపై రోజా ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోబోమని సోమిరెడ్డి హెచ్చరించారు.

Click on Image to Read:

trs-tdp

lagadapati

narayanked

ravindranath-reddy

devineni-uma--vamshi

cbn-yanamala-devineni-uma

Indian-supreme-court

manikyala-rao

jagan

vamshi

bjp-trs-tdp

kcr-modi-cbn

vamshi

paritala-sunitha1

praneetha

chandrababu

arrest

dokka-patipati-chandrababu1

ap-secretariate

YS-Jagan-Behaviour

chandrababu-naidu

roja1

MLA-Rajender-Reddy

errabelli-dayakara-rao1

Adinarayana-Reddy

First Published:  15 Feb 2016 4:13 AM GMT
Next Story