Telugu Global
Cinema & Entertainment

దేవిశ్రీ ప్ర‌సాద్ త‌న అవార్డుల‌ను ఆమెకు అంకిత‌మిచ్చాడు!

ఇటీవ‌ల దుబాయ్‌లో ఘ‌నంగా జ‌రిగిన గామా మ్యూజిక్ అవార్డ్స్ కార్య‌క్రమంలో దేవీశ్రీ ప్రసాద్‌కి రెండు అవార్డులు ద‌క్కాయి. ఒక‌టి స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలోని సూప‌ర్ మ‌చ్చి పాట‌కు బెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ సాంగ్ అవార్డు. రెండ‌వ‌ది మ‌హేష్‌బాబు సినిమా శ్రీమంతుడుకి బెస్ట్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ అవార్డు. ఈ కార్య‌క్రమానికి కొన్ని రోజుల ముందే దేవిశ్రీ తండ్రి సినీర‌చ‌యిత స‌త్య‌మూర్తి క‌న్నుమూశారు. అలాగే మ‌రో సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్ త‌ల్లి మ‌నోర‌మ కూడా మ‌ర‌ణించారు. బాత్‌రూమ్‌లో కాలుజారి ప‌డిన ఆమె, హాస్ప‌ట‌ల్‌కి తీసుకువెళ్లే స‌రికే ప్రాణాలు వ‌దిలారు. గామా […]

దేవిశ్రీ ప్ర‌సాద్ త‌న అవార్డుల‌ను ఆమెకు అంకిత‌మిచ్చాడు!
X

ఇటీవ‌ల దుబాయ్‌లో ఘ‌నంగా జ‌రిగిన గామా మ్యూజిక్ అవార్డ్స్ కార్య‌క్రమంలో దేవీశ్రీ ప్రసాద్‌కి రెండు అవార్డులు ద‌క్కాయి. ఒక‌టి స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలోని సూప‌ర్ మ‌చ్చి పాట‌కు బెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ సాంగ్ అవార్డు. రెండ‌వ‌ది మ‌హేష్‌బాబు సినిమా శ్రీమంతుడుకి బెస్ట్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ అవార్డు. ఈ కార్య‌క్రమానికి కొన్ని రోజుల ముందే దేవిశ్రీ తండ్రి సినీర‌చ‌యిత స‌త్య‌మూర్తి క‌న్నుమూశారు. అలాగే మ‌రో సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్ త‌ల్లి మ‌నోర‌మ కూడా మ‌ర‌ణించారు. బాత్‌రూమ్‌లో కాలుజారి ప‌డిన ఆమె, హాస్ప‌ట‌ల్‌కి తీసుకువెళ్లే స‌రికే ప్రాణాలు వ‌దిలారు. గామా మ్యూజిక్ అవార్డులు అందుకున్న దేవిశ్రీ ప్ర‌సాద్, తాను అందుకున్న అవార్డుల‌ను త‌న తండ్రికే కాక అనూప్ రూబెన్స్ త‌ల్లికి కూడా అంకితం ఇస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించి త‌న సంస్కారాన్ని చాటుకున్నాడు.

Click on Image to Read:
bahubali
allu-arjun
summer-tollywood-movies
Mehreen-FI
rajamouli-jr-ntr
hero-nani
naga-shourya
parineeti-chopra
sunny-leone
First Published:  14 Feb 2016 10:15 PM GMT
Next Story