Telugu Global
NEWS

యనమల, ఉమపై చంద్రబాబు రుసరుస !

ఏపీ కేబినెట్ భేటీలో మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవా, గాలేరు- నగరి ప్రాజెక్టుల అంచనాల పెంపు వ్యవహారం బయటకు పొక్కి రచ్చ జరగడంపై సీఎం సీరియస్‌గా స్పందించారు. ఆర్థిక శాఖ, జలవనరుల శాఖ మధ్య సమన్వయం లేకపోవడం వల్లే వ్యవహారం వివాదాస్పదమైందని, ప్రభుత్వ పరువు తీశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. రెండు శాఖల మంత్రులు తమ తీరును సమర్ధించుకునేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అంచనాల పెంపులో […]

యనమల, ఉమపై చంద్రబాబు రుసరుస !
X

ఏపీ కేబినెట్ భేటీలో మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవా, గాలేరు- నగరి ప్రాజెక్టుల అంచనాల పెంపు వ్యవహారం బయటకు పొక్కి రచ్చ జరగడంపై సీఎం సీరియస్‌గా స్పందించారు. ఆర్థిక శాఖ, జలవనరుల శాఖ మధ్య సమన్వయం లేకపోవడం వల్లే వ్యవహారం వివాదాస్పదమైందని, ప్రభుత్వ పరువు తీశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. రెండు శాఖల మంత్రులు తమ తీరును సమర్ధించుకునేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అంచనాల పెంపులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆర్థిక శాఖ చెప్పడంతో సీఎం తీవ్రంగా స్పందించారని చెబుతున్నారు. నిబంధనల ఉల్లంఘన జరిగిందని ప్రచారం చేయడం ద్వారా అవినీతి చోటుచేసుకుందన్న సంకేతాలు జనంలోకి వెళతాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

హంద్రీనీవా, గాలేరు- నగరి ప్రాజెక్టుల అంచనా వ్యయం పెంచడం ద్వారా దాదాపు రూ. 6 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని పత్రికల్లో కథనాలు వచ్చాయి. పైగా అంచనాల పెంపు ఫైల్‌ను గత సీఎస్, ప్రస్తుత సీఎస్ ఇద్దరూ కూడా తిరస్కరించి పంపారు. ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖ నుంచి వేర్వేరు నివేదికలను కోరారు. అయితే రెండు శాఖలు రెండు భిన్నమైన నివేదికలు ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. ఈపీసీ విధానంలో ఒకసారి కాంట్రాక్టు అప్పగించిన తర్వాత అంచనాల పెంపు నిబంధనలకు విరుద్ధం. కానీ టీడీపీ రాజ్యసభ ఎంపీ కంపెనీతో పాటు సబ్‌ కాంట్రాక్టర్లుగా ఉన్న టీడీపీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు జీవో 22, 63ని తీసుకొచ్చారు.

ఈ అంచనాల పెంపు వల్ల ఆరు వేల కోట్లు ప్రభుత్వం నష్టపోవాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం బయటకు పొక్కి పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కడంతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడ్డారు. ఈ అంచనాల పెంపు వెనుక లోకేష్ చక్రం తిప్పారని కొన్ని పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. దీంతో ప్రభుత్వ పరువు పోయింది. ఈ నేపథ్యంలో కేబినెట్‌ భేటీలో అంచనాల పెంపుపై వాడివేడీగా చర్చ జరిగింది. రూ. 6 వేల కోట్ల విలువైన ఇంత పెద్ద అంశం రచ్చకెక్కడంతో సీఎం మండిపడినట్టు చెబుతున్నారు. ఆర్థిక, నీటిపారుదల శాఖలు సమన్వయంతో వ్యవహరించి ఒకే తరహాలో ముందుకెళ్లి ఉంటే ఈ వ్యవహారం సాఫీగా సాగిపోయేదని ప్రభుత్వ పెద్దలు అంసతృప్తితో ఉన్నారు. మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోడి కోడలు నవ్వినందుకు బాధపడ్డట్టు లోకేష్, ఉమల అవినీతి వ్యవహారం కన్నా అది రచ్చకెక్కినందుకు చంద్రబాబుకు ఎక్కువ కోపం వచ్చిందని మంత్రులు గుసగుసలాడుకున్నారట..!

Click on Image to Read:

R-krishnaiah

t-tdp

2343da12-e725-4bb0-80b5-4637280ab592

trs-tdp

lagadapati

narayanked

ravindranath-reddy

devineni-uma--vamshi

Somireddy-Chandramohan-Redd

Indian-supreme-court

manikyala-rao

jagan

vamshi

bjp-trs-tdp

kcr-modi-cbn

vamshi

paritala-sunitha1

praneetha

chandrababu

arrest

dokka-patipati-chandrababu1

ap-secretariate

YS-Jagan-Behaviour

chandrababu-naidu

roja1

MLA-Rajender-Reddy

errabelli-dayakara-rao1

Adinarayana-Reddy

First Published:  15 Feb 2016 9:05 AM GMT
Next Story