Telugu Global
Cinema & Entertainment

కనీసం బుల్లితెర మీదైనా రికార్డ్ సృష్టిస్తాడా చెర్రి ?

 బ్రూస్ లీతో అట్టర్ ఫ్లాప్ అందుకున్న రామ్ చరణ్… కనీసం బుల్లితెరపైనైనా ప్రభంజనం చూపించడానికి సిద్ధమౌతున్నాడు.  శ్రీనువైట్ల దర్శకత్వంలో చెర్రీ నటించిన బ్రూస్ లీ సినిమాను జీ-తెలుగు ఛానెల్ ఎక్స్ క్లూజివ్ గా ప్రసారం చేయబోతోంది. ఆదివారం… అందులో వాలంటైన్స్ డే కూడా కావడంతో… బ్రూస్ లీ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని సదరు ఛానెల్ భావిస్తోంది. మరి బ్రూస్ లీ బుల్లితెర రికార్డుల్ని బద్దలుకొడతాడా అనేదే ప్రశ్న. ఇప్పటికే టీవీల్లో బాహుబలి, శ్రీమంతుడు సినిమాలు ఆల్ […]

కనీసం బుల్లితెర మీదైనా రికార్డ్ సృష్టిస్తాడా చెర్రి ?
X

బ్రూస్ లీతో అట్టర్ ఫ్లాప్ అందుకున్న రామ్ చరణ్… కనీసం బుల్లితెరపైనైనా ప్రభంజనం చూపించడానికి సిద్ధమౌతున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో చెర్రీ నటించిన బ్రూస్ లీ సినిమాను జీ-తెలుగు ఛానెల్ ఎక్స్ క్లూజివ్ గా ప్రసారం చేయబోతోంది. ఆదివారం… అందులో వాలంటైన్స్ డే కూడా కావడంతో… బ్రూస్ లీ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని సదరు ఛానెల్ భావిస్తోంది. మరి బ్రూస్ లీ బుల్లితెర రికార్డుల్ని బద్దలుకొడతాడా అనేదే ప్రశ్న. ఇప్పటికే టీవీల్లో బాహుబలి, శ్రీమంతుడు సినిమాలు ఆల్ టైం రికార్డులు సృష్టించాయి. ఈ రెండు సినిమాల టీఆర్ పీని అందుకోవడానికి చాలామంది స్టార్ హీరోలు పోటీపడుతున్నారు. ఇలాంటి టైమ్ లో…. బాక్సాఫీస్ ఫెయిల్యూర్ తో ఉన్న చెర్రీ…. బ్రూస్ లీతో బాహుబలి రికార్డులు బద్దలుకొట్టడం అసాధ్యం అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే… వెండితెరపై సూపర్ హిట్టయిన సినిమాకే బుల్లితెరపై కూడా కాసులు రాలుతాయి. మరి ఎంతో డబ్బుపెట్టి జీ-చానెల్ కొనుక్కున్న బ్రూస్ లీ సినిమా… కనీసం వాళ్ల రెవెన్యూ టార్గెట్ నైనా చేరుకోవాలని ఆశిద్దాం.

First Published:  13 Feb 2016 1:42 AM GMT
Next Story