Telugu Global
Cinema & Entertainment

అమీర్ కోసం పోర్న్ స్టార్ అవుతానన్న రాఖీ

ఎవ‌రు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు అన్న చందంగా.. స‌న్నీలియాన్ కు వ‌స్తున్న మ‌ద్ద‌తు చూస్తుంటే బాలీవుడ్ ఐట‌మ్ డాన్స‌ర్ రాఖీ సావంత్ కు క‌డుపు మండుతున్న‌ట్లుంది. ఈ మ‌ధ్య ఒక ఇంటర్వ్యూలో స‌న్నీలియాన్ ను త‌న పోర్న్ స్టార్ ఇమేజ్ మీద యాంక‌ర్ ఇబ్బంది పెట్ట‌ని ప్ర‌శ్న‌లు వేసిన‌ప్ప‌టికి.. త‌ను ఏ మాత్రం త‌డ‌బ‌డ‌కుండా..బ్యాలెన్స్ త‌ప్ప‌కుండా.. ఆన్స‌ర్స్ చేయ‌డంతో దేశ వ్యాప్తంగా సన్నీకి మ‌ద్దుతు ల‌భించింది. బాలీవుడ్ మిష్ట‌ర్ ప‌ర‌ఫెక్ట్ […]

అమీర్ కోసం పోర్న్ స్టార్ అవుతానన్న రాఖీ
X

ఎవ‌రు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు అన్న చందంగా.. స‌న్నీలియాన్ కు వ‌స్తున్న మ‌ద్ద‌తు చూస్తుంటే బాలీవుడ్ ఐట‌మ్ డాన్స‌ర్ రాఖీ సావంత్ కు క‌డుపు మండుతున్న‌ట్లుంది. ఈ మ‌ధ్య ఒక ఇంటర్వ్యూలో స‌న్నీలియాన్ ను త‌న పోర్న్ స్టార్ ఇమేజ్ మీద యాంక‌ర్ ఇబ్బంది పెట్ట‌ని ప్ర‌శ్న‌లు వేసిన‌ప్ప‌టికి.. త‌ను ఏ మాత్రం త‌డ‌బ‌డ‌కుండా..బ్యాలెన్స్ త‌ప్ప‌కుండా.. ఆన్స‌ర్స్ చేయ‌డంతో దేశ వ్యాప్తంగా సన్నీకి మ‌ద్దుతు ల‌భించింది. బాలీవుడ్ మిష్ట‌ర్ ప‌ర‌ఫెక్ట్ అమీర్ ఖాన్ తో ఒక్క క్ష‌ణం న‌టించ‌డం కూడా అదృష్ట‌మే అని చెప్పింది. ఆ త‌రువాత అమీర్ ఖాన్ కూడా స‌న్నీలియాన్ తో న‌టించ‌డానికి త‌నకెటువంటి అభ్యంత‌రాలు లేద‌ని ఓపెన్ గా చెప్పడంతో స‌న్న లియోన్ ఆనందానికి అవదులు లేకుండ పోయింది. దీంతో ఈ మ‌ధ్య రాఖీ సావంత్ ఒక ఇంట‌ర్వూలో త‌ను కూడా పోర్న్ స్టార్ కావాల‌నుకుంటున్న‌ట్లు చెప్పింది. దీనికి కారణం అమీర్ ఖాన్ లాంటి వ్య‌క్తి సన్నీకి మ‌ద్దుతు ప‌ల‌క‌డం ఏంటి అనేది రాఖీ ఆవేదన‌. అందుకే త‌ను కూడా పోర్న్ స్టార్ అయితే బాలీవుడ్ లో అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ త‌న‌కు మ‌ద్ద‌తు పుల‌కుతార‌ని త‌న ఆక్రోషం వెలిబుచ్చింది. నిజంగా పులిని చూసి న‌క్క వాత పెట్టుకోవ‌డం అంటే ఇదేనేమో అంటున్నారు ప‌రిశీల‌కులు.

First Published:  13 Feb 2016 12:26 AM GMT
Next Story